B008 dated at Pippara the 21.07.T20
Hello and welcome back to Eckce. Hope everyone is fine with healthy hearts.
I should have written this blog yesterday. But due to severe headache I was unable to write anything. The thing I wanted to point out was headache itself. అసలు headache ఎందుకు వస్తుంది? నేనెక్కడా స్టడీ చేసి చెప్పట్లేదు just నా experiences మాత్రమే రాస్తున్నా. ఎందుకు నిన్న నాకు అంత headache వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంలో వచ్చిన ఆలోచనే ఈ blog.
Body and soul వేర్వేరు అని వింటూ and అంటూ ఉంటాం. కానీ రెండూ భలే link అయ్యుంటాయ్ అని మీకు ఇప్పుడే నిరూపిస్తా. మీరు నిద్రపోతున్నప్పుడు sudden గా మంచం మీద నుంచి కింద పడిపోతున్నట్టు భయం వేసి నిద్ర లేచారా? గాల్లో ఎగురుతూ కింద పడినట్టు అనిపించి ఉలిక్కి పడి నిద్ర లేచారా? ఒకవేళ అలా జరిగితే మాత్రం మీకు ఎదో కల వచ్చి ఉండాలి. అందులో మీరు ఒక చెట్టు మీద నుంచో ఏదైనా building మీద నుంచో కింద పడిపోతూ ఉండి ఉండాలి. నిజం అయితే ఒప్పుకోండి. అబద్ధం అయితే తెలుసుకోండి. నమ్మకపోతే మానేసుకోండి. ఇది నా అభిప్రాయం కాదు, నా అనుభవం.
అయితే ఇలా మన ఆలోచన బట్టే మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి అనేది science కూడా చెప్పే నిజం.
ఏదైనా బాధ కలిగించే విషయం, నిజానికి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏదైనా చూసినా విన్నా, మరి ముఖ్యంగా మనసుకి బాధ అనిపించిన సొంత విషయం ఏదైనా జరిగితే అన్నం తినే వేళ కూడా ఆకలి లేదు అనిపిస్తుంది. తినలేం కూడా. మరి అన్నం తినే వేళ కాకపోతే ఏం అనిపిస్తుంది? అదే ఇప్పుడు topic. మనసుకి తగిలిన గాయం మనసుతో పాటు శరీరాన్ని కూడా కెలకాలి అనే దురదతో ఉంటుంది. ఆకలి రూపంలో బలి కాబోయే కడుపు తప్పించుకుంది కానీ ఏదో ఒక అవయవం బలవ్వాల్సిందే ఆ గాయానికి. చుట్టుపక్కల ఉండే పరిస్థితుల బట్టి మన మనస్తత్వం బట్టి అవయవ ఎంపిక ఆధార పడుతుంది. మనం కోపిష్టులమయ్యి చుట్టూ ఉన్నది మన వాళ్లే అనిపిస్తే అది రూపాంతరం చెంది కట్టలు తెంచుకుని బయటకి వచ్చి వస్తువుల్ని బద్దలు కొట్టడం, గోడలు గుద్ది చేతుల్ని గాయపరచటం చేస్తుంది. లేదు ప్రతికూల పరిస్థితుల్లో అనువు గాని చోట ఉంటే మాత్రం కట్టలు తెంచుకునే దమ్ము లేక ఆలోచనల్లో మూసుకుని కూర్చుని బుర్ర పాడు చేసి ఇదిగో ఇలా తలనొప్పి తెచ్చి పెడుతుంది.
అసలు ఇది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది?
*️⃣మనకు నచ్చని విషయం జరిగినప్పుడు అని చెప్పొచ్చు. కానీ లోకంలో అన్ని మనకు నచ్చినవే జరుగుతున్నాయా? అవన్నీ మనం పట్టించుకుంటున్నామా?
*️⃣మనం అనుకున్నది జరగనప్పుడు. అసలు ఎవడు అనుకోమన్నాడండి.? కానీ ఉండలేమే. ఏదొకటి అనుకోకుండా ఉరుకోలేం.
*️⃣మనకి తీవ్రమైన నష్టం కలిగినప్పుడు. నష్టం వచ్చేలాగా ఎవడు చేసుకోమన్నాడు? ఇక్కడే ఒక అద్భుతమైన సామెత గుర్తు చేసుకోవాలి. ఏదీ తెగే వరకు లాక్కోకూడదు. తర్వాత అతుక్కోలేము. Self control ఉండాలి. హా అదే ఉంటే ఈ తలనొప్పి ఎందుకు తెచ్చుకుంటాం అంటాం ఇపుడు.
*️⃣ఇంకా బయటకి చెప్పుకోలేని కొన్ని విషయాలు ఇలా లోపల కోపం తెప్పించేలా రెచ్చగొట్టినప్పుడు ఇలాగే జరుగుతుంది.
*️⃣అలాగే మనకి బాగా కావలసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్లని ఆర్చటమో తీర్చటమో చెయ్యాలి కానీ ఇలా తలబాదుకోవటం ఏంటి అంటారా? వాళ్లు మనల్ని కూడా కావాల్సినవాళ్ళు అనుకోవాలి కదా మరి. అలాంటపుడు అంత నొప్పి ఎందుకు అంటారా? అది వేరే విషయం అవుద్ది లెండి.
*️⃣మన అనుకునే వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు. ఎలా అంటే వాళ్ళతోనే ఇలాంటి బాధల్ని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు వాళ్లే బాధ పెడుతున్నారు అనే బాధ.
ఇలా ఎన్నో రకరకాల సందర్భాల్లో మన ఆలోచన మన శరీరాన్ని నియంత్రిస్తుంది. అలాంటప్పుడు ఒక సంకల్పిత ప్రతీకార చర్య లాగానే శరీరం స్పందిస్తుంది. అంటే శ్రమ కి గాయానికి తాత్కాలికంగా గురి అవుతుంది.
మరి గాయం తప్పదు అనుకున్నప్పుడు దానికి మందు ఏదొకటి ఉండాలి కదా. దానికి అదే తగ్గే వరకు ఓర్చుకోలేం కదా. ఎదో ఒక మందుని ఏర్పరచుకోవాలి. అంటే నచ్చిన పని చేయటం. నచ్చిన వాళ్ళతో ఉండటం.
తలనొప్పిగా ఉంది మీతో మాట్లాడితే తగ్గుద్ది అని నాతో కొందరు నాతో మాట్లాడతారు ఒక్కోసారి. అంటే నా మాటలో, నా చెవులో వాళ్ళకి మందులు అన్నమాట.
కొంతమంది dance చేస్తారు, పాటలు పాడుకుంటారు. నచ్చిన పాటల్ని వింటారు. కొందరు ఫోన్ లో data గంటలో అవ్వగొట్టేస్తారు. కొంతమంది spiritual filling చేసుకుంటారు. మరి నేనేం చేసాను?
నిన్న నా ఇద్దరు పిల్లలతో బాగా ఆడుకున్నాను.
ఇంతకీ నాకు తలనొప్పి ఎందుకు వచ్చిందా అని ఆలోచించాను. పైన చెప్పిన సందర్భాల్లో ఒకటి match అయింది కూడా. అందుకే వచ్చిందేమో అనుకున్నా. కానీ ఈ రోజు కూడా వస్తుంది. వేరే కారణం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నా మనసు బానే ఉంది. పై కారణాలు ఏవి కాకపోవచ్చు.
ఇప్పుడు type చేస్తుంటే అర్ధం అవుతుంది. నా కళ్ళు నొప్పిగా ఉన్నాయి. నేను regular గా వాడే spects కనిపించట్లేదు అని వేరేది పెట్టుకుంటున్నా నిన్నటి నుంచి. అద్ది సంగతి. ముందు దాన్ని వెతుక్కోవాలి.
-Eckce.

4 comments:
😵😵😵😵
మీ బ్లాగ్ అద్భుతం....కొత్త కొత్త విషయాలు కనిపెడతారు..లేని వాటిని కూడా పుట్టిస్తారు...
ఎలా కంటే ఈరోజు నాకు కూడా తలపోటు తెప్పించినట్లు.....
Sir
This is all written by you?
If yes definitely there is a good writer in you.
Please develop that habit of expansion of the feeling.Very good Sir
Thank you sir
Post a Comment