B009 dated at Tadepalligudem the 28.12.T20.
Happy to welcome you back to EckcE. Long time no writing. Let's get into the content now.
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా..
ఒక మనిషికి శత్రువుని వేరే ఎవరో తయారు చెయ్యరు. తెలిసో తెలీకో ఎవరి శత్రువుని వాళ్లే సష్ఠించుకుంటారు. దాన్నే ఖర్మ అంటారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినప్పుడే అది మన దృష్టికి వస్తుంది.
మన చుట్టూ జరిగే పరిస్థితులు అన్నీ మన నియంత్రణలో ఉన్నాయి అనుకోవటం అంత బుద్ధి తక్కువ పొరపాటు మరొక్కటి ఉండదు అని ఈ సందర్భంలో చెప్పగలను. ఎవరి ఎమోషన్ వారిని నడిపిస్తుంది. అదే మరొక్కరిని వారికి శత్రువుగానో లేదా ఇంకొక్కరికి ప్రమాదంగానో మారుతుంది. ఆ ప్రమాదంలో పడ్డ ఇంకొకరు కూడా ఆటలో అరటిపండులా ఇరుక్కున్నారు అనుకోలేము. వారికి తెలియకుండా వారి స్వయంకృతాపరాధమే వారికి ఖర్మకాండ చేసింది అనాల్సిందే.
అనవసర అంశాల్లో అనాలోచితంగా అధికమైన ఆతిథ్యం అగుపరిస్తే ఆఖరికి అనాథగా అడుక్కోవాల్సొస్తుంది.
ఒక విషయంలో ఎంత వరకు మన ప్రమేయం అవసరమో మన మీద అది ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచన చేసి అడుగెయ్యాలి
అందుకే పెద్దలు మనకోసం కొన్ని సామెతలు రూపొందించారు.
అనువుగాని చోట అధికులమనరాదు.
-eckce
నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.
అనే ముందు ఆలోచించు.
అందుకే ప్రణాళికలు మాత్రమే మనవి.
పరిస్థితులు పరాయివి వినమని నా మనవి.
2 comments:
ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం అనేది ఈ బ్లాగ్ ద్వారా తెలుసుకున్న అన్న.
Eexcellent
Post a Comment