B011 dated at Tadepalligudem the 15.01.T21
నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయి కి న్యూ ఇయర్ గ్రీటింగ్ ఇచ్చాను. ఇవాళ రేపు బట్టల షాపు పాంప్లెట్ లలో ఆఫర్స్ గురించి చెప్తూ క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో అని రాసినట్టు నేను కూడా న్యూ ఇయర్ గ్రీటింగ్ లో happy sankranthi అని కూడా రాసాను. అప్పట్లో సంక్రాంతి ని పొంగల్ అంటారని నాకు తెలియదు. ఆ అమ్మాయ్ ఇంకో అమ్మాయి తో కలిసి నన్ను అడిగింది, happy new year కింద ఇంకా ఎదో రాసావ్ ఏంటి అని. తను కాన్వెంట్ లో చదివిన అమ్మాయి కూడా. కానీ నేను చెప్తే కానీ అర్ధం చేస్కోలేకపోయింది. నేను తప్పు రాసా అని నేను అనుకోవట్లేదు. ఇపుడు ఇది ఎందుకు రాస్తున్నా అంటే ఆ అమ్మాయి లాగానే కొంతమంది తెలుగు పదాల్ని ఇంగ్లీష్ లో రాస్తే చదవలేరు. ఇప్పటికీ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అలా ఏదైనా మెస్సేజ్ పంపితే ఫోన్ చేసి ఏంటి ఎదో పంపావ్ అంటాడు.
కొంతమంది అయితే చదివింది అర్ధం కాకపోయినా సందర్భం బట్టి సొంత అర్ధాలు వెతుకుతారు. ఒక బిల్లు లో పేరు రాయాల్సిన చోట vacant అని రాసి ఉంటే ఒకాయన దాన్ని వసంత్ అని చదివాడు. ఇది ఆయన చేసిన మిస్టేక్. Mistake అంటే miss+take, అంటే తప్పుగా తీసుకున్నాడు.
మా ఊళ్ళో మా సీనియర్ ఒక అబ్బాయి తో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు నేను అడిగితే చెప్పేవాడు. ఒక సినిమాలో దుపట్టా ఇలా చేత్తో పట్టుకోకు అనటం చూసి దుపట్టా అంటే అని అడిగితే అతను అన్నాడు, దుపట్టా కాదు, దుప్పట్లా అని. He meant to say, dont handle it like a blanket. ఇంకొక సందర్భంలో బైపాస్ రోడ్ గురించి మాట్లాడుతూ అది బైపాస్ కాదు By Bus అన్నాడు. బహుశా ఆయన అర్ధం bus లు దాని మీదుగా వెళ్లాయి అని చెప్పటం ఏమోకానీ చాలా రోజుల వరకు అతను చెప్పిందే నిజమని నేను నమ్మేసాను. అంత కాన్ఫిడెంట్ గా చెప్పినపుడు తెలియని వాడు ఎవడైనా నమ్మాల్సిందే లే. దుపట్టా అనే పదాన్ని తెలుగులో వాడతారు అని తెలిసాక గాని అర్ధం కాలేదు మనోడు దుప్పట్లా అని mistake చేసాడు అని. కానీ చాలా సందర్భాల్లో చాలా మంది చాలా విషయాలు నాకు సరిగ్గానే చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ళకి థాంక్స్.
ఇప్పటికీ ఎంతో మంది కొన్ని పదాల్ని mistake చేస్తారు. Sharpner ని చాక్ మర అని, స్నానం ని స్తానం అని, Maths ని Macs, వెతుకు ని నెతుకు, బయానా ని బజానా అని పలుకుతారు. ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవి common గా ఎక్కువ మంది చేసే mistake లు. వాళ్ళని సరి చేసినా అంత సులువుగా మార్చుకోలేరు. చిన్నప్పుడు by mistake నేర్చుకున్న పదాలు కదా అవి.
ఇందాక దుపట్టా లాగా కొన్ని తెలుగు పదాలు వింటే అసలు ఇవి తెలుగు పదాలేనా లేక English నుంచి డబ్బింగ్ లాంటిది ఏమైనా చేశారా అన్నట్టు ఉంటాయి. జోక్యం, సైగ, ఇలా ఇపుడు గుర్తు రాని పదాలు ఉన్నాయి. నేను ఎలా మాట్లాడినా కానీ లిఖితపూర్వకంగా పదం యొక్క ప్రాధాన్యం పోకుండానే చూస్తాను. కానీ నేర్చుకోవడం కష్టమై భాష కంటే భావం ముఖ్యం అని రాజీ పడే వాళ్లే ఎక్కువ ఉంటారు లే.
-eckce
No comments:
Post a Comment