B22 dated at Tadepalligudem the 01.04.T21
ఏప్రిల్ నెల అంటే ఎందుకో కాస్త పక్షపాతం నాకు. ఒక వింత వాతావరణాన్ని మనకి (నాకు) కొత్తగా పరిచయం చేస్తుంది. కొత్త ఎండలు మొదలయ్యే ముందు పూతలు రాలే ఆ పళ్ళ చెట్ల నుండి వచ్చే వాసనతో కూడిన నునువెచ్చని గాలితో ప్రతి ఏడాది నూతనానుభూతిలో నా మనసు ఏదో మొదటిసారి అలా అనుభవిస్తున్న భావాలతో గత పాతికేళ్లుగా నిండుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
నేను ఎంత చెప్పాలి అనుకున్నా ఇంకా నేను చెప్పాలి అనుకుని చెప్పలేకపోతూ ఉన్నది ఏదైనా ఉంది అంటే అది ఈ ఏప్రిల్ నెలలో వచ్చే ఆ వాతావరణ మార్పుల వల్ల నాకు కలిగే ఆ సంభ్రమాశ్చర్యమే. అసలు నాకే ఇలా అనిపిస్తుందా అనే సందేహం కూడా నాకు ఉండేది కానీ అది నిజమేం కాదని తెలిసింది. ఎందుకంటే వసంతఋతువులో ఉన్న ప్రత్యేకతే అదంట. మార్చి మధ్యస్థంలో మొదలవ్వాల్సిన ఆ ఋతువు లక్షణాలు ఏప్రిల్ లో పరిపక్వత పొంది దాని రుచుల్ని మనకి అందిస్తాయి.
చీకటిపై ఆధిపత్యం చేలాయించే పగటి వెలుగులు, ఇలా ఉండాలిరా అనిపించే ఉష్ణోగ్రతలు, చిట్టిపిల్లల్ని ఈనే జంతువులు, రాలే పూతలు, పూసే పువ్వులు, కాసే కాయలు, వాటితో వచ్చే ఘుమఘుమలు, ఎల్లప్పుడూ సముద్రం దగ్గర ఉన్నామా అనిపించే తాజా సాయంత్రపు చల్లటి గాలులు (నన్ను ఉర్రూతలు ఊగించింది ఇదే). ఇవే కదా ఏప్రిల్ నెలకు అలంకారాలు.
ఏప్రిల్ ఒకటి రాగానే ఫూల్ చెయ్యాలని కొందరు, ఫూల్ అవ్వకూడదని కొందరు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడేవారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవిలో వెళ్ళినప్పుడు పక్కింటి పాప వాళ్ల అమ్మని ఏప్రిల్ ఫూల్ చేసింది. అప్పుడు వాళ్ల అమ్మ ఇది ఏప్రిల్ ఫూల్ నెల కాదు మే నెలమ్మా అని చెప్పగానే ఆ పాప మళ్ళీ ఫూల్ చేసి మే నెల అని చెప్పి బాగా నవ్వుకుని ఆనందించింది. She is obsessed with fooling in this period. Elementary school లో చదివే రోజుల్లో మా teacher ను fool చేసి ఏప్రిల్ fool అన్నారు ఎవరో. దానికి hurt అయిన ఆయన పెద్ద వాళ్ళని అలా చేసేటప్పుడు fool అనకూడదు ఏప్రిల్ first అనాలి అని cover చేసుకున్నారు. ఆయన పేరు శివయ్య కానీ సీతయ్య character ఆయనది.
కొంచెం పెద్దయ్యాక అయితే ఏప్రిల్ నెల మొత్తం చదువుల నెలే. ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ రాకపోతే నేరం అప్పట్లో. ఇంకా పెద్దయ్యాక ఈ ఏప్రిల్ నెలలోని కొత్త వాతావరణమే గుర్తు చేసేది అసలు నాకు వయసు వచ్చింది అని. ఇంకా పెద్దయ్యాక ఈ ఏప్రిల్ నెలే నాకు గుర్తు చేస్తుంది నా వయసు పెరుగుతుంది అని. ఎందుకంటే నేను పుట్టింది ఈ నెలలోనే అని తెలిసింది. నేనే కాదు మా అక్క కూడా పుట్టింది. మేమే కాదు నాకు మున్ముందు దగ్గరైన కొంతమంది కూడా ఇదే నెలలో పుట్టడం కూడా మరో వింత. ఇవన్నీ సరిపోక ఇదే నెలలో పుట్టిన అమ్మాయితో ఇదే నెలలో తీరని తిప్పలు తెచ్చి పెట్టే తీవ్ర తీర్మానం జరిగింది. అది నేను చూసిన, చేసిన ఘోరాల్లో అతి పెద్దది. అయినా నేను ఇలా బాగానే ఉన్నానంటే దానికి కారణం ఏప్రిల్ లో వచ్చే ఈ కొత్త వాతావరణమే.
ఇప్పుడైతే ఏప్రిల్ వచ్చింది అంటే మార్చ్ వెళ్ళిపోయింది అనే ఆనందం కూడా దీనికి తోడవుతుంది. మనవాళ్ళు కూడా ఇప్పుడే యుగానికి ఆది అని ఒక రోజు సెలవు తీసుకుంటారు కదా. ఈ ఋతువులోని లక్షణాలే వారికి ఆ ప్రేరేపణ ఇచ్చి ఉంటాయేమో అని ఇప్పుడు సరదాగా అనిపిస్తుంది.
వారు అన్నారని కాదు గాని నా దృష్టిలో ఇదే నూతన సంవత్సరం. Yes I am Obsessed with this Season which falls in April.
Happy New Year.
1 comment:
హ్యాపీ ఏప్రిల్ బావ
Post a Comment