Wednesday, August 23, 2023

మా నాన్న 2

B047/Daddy/2023 dated at PMLanka the 23.08.T23

Simple గా చెప్పాలి అంటే నా జీవితం మా నాన్న మాతో ఉన్నప్పుడు, మమ్మల్ని విడిచి వెళ్ళిన తర్వాత గా separate చేయొచ్చు. మా నాన్న పోయిన తర్వాత నేను అందరిలాగే మామూలుగానే కనిపించవచ్చు. కానీ నాకు నేను మామూలుగా అనిపించలేను. ఎందుకంటే మా నాన్న ఒక్కరే అయినా in respect of his working ability ఆయన ఎప్పుడూ ముగ్గురితో సమానం. It's neither easy to live in his shoes nor after his shadows. ఎందుకంటే నన్ను ఆయనలాగా పెంచలేదు మా నాన్న. అందుకే ఆయన ఎలా బతికారో చూసాను కానీ ఆయనలా బతికే సాహసం చెయ్యలేదు. ఎందుకంటే అది ఆయనకే సాధ్యం. ప్రతి నాన్న గురించి ప్రతి కొడుకు ఇలాగే చెప్పొచ్చు ఏమో కానీ ప్రతి కొడుకు నాలాగా ఇబ్బంది పడడు. మా నాన్న నా సుఖమే కోరుకున్నారు కాబట్టి నాకు కష్టపడాలి అనే ఆలోచన రానివ్వలేదు. నాకున్న కొన్ని బలహీనతల్ని కూడా అర్థం చేసుకుని నన్ను బలోపేతం చేశారు కానీ నన్ను ఎప్పుడూ బలవంతం చెయ్యలేదు. నా జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకోవటం లో విఫలమైన నేను ఇలా పలు రోడ్ల కూడలి లో ఎటు వెళ్ళాలో తెలియక నిలిచి ఉన్నాను. దానికి పూర్తిగా నేనే బాధ్యుడిని. అందుకే మా నాన్న నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్ని తీసుకోలేక సతమతం అవుతున్నాను. ఆయన కష్టపడి నాకు అన్ని సమకూర్చినప్పటికీ ఆయన legacy ని కాపాడుకునే ధైర్యాన్ని మాత్రం నాకు నేర్పించలేదు ఆయన. బహుశా ఈ రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండరు. అందుకే నాకు ఏమి తెలియ చెప్పకుండానే వెళ్ళిపోయారు. 


మరణం ఆయనను చేరినప్పుడు నా గురించి ఆయనకు ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి అనే ఆలోచన నన్ను తొలిచి వేస్తుంది.


ఆయన ఎన్నో విషయాల్లో నేర్పరి. ఆయన తప్ప ఎవరు చెయ్యలేని కొన్ని చేతి పనులు ఎందరో ఆయనతో చేయించుకోవటం నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అలాగే ఆయన అమాయకత్వం లోని మంచితనాన్ని ఎందరో ఉపయోగించుకుని లాభ పడ్డారు. ఇప్పుడు ఆయన లేనప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు పొందినవన్నీ మరిచి ఇంకా అదే పంథాలో వెళ్తున్న కొందర్ని నేను ఆపలేకపోతున్నాను. అంటే అదే అమాయకత్వాన్ని నేను మోసుకుని ముందుకు వెళ్తున్నాను. 


నేనింత భారంగా రాస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆయన లాంటి ఒక వ్యక్తికి వారసుడిగా ఉండటం అంటే ఆయనకున్న శక్తిసామర్ధ్యాలు ఉండి ఉండాలి. అవి నాకు లేవు. అందులోనూ ఆయన హఠాత్తుగా నన్నొక కుటుంబ పెద్దను చేయటం ఆయన లేరన్న పుండుపై కారం లాంటిది.


-eckce

2 comments:

JOHN ABRAHAM said...

మనసుని హత్తుకుంది నీ మాట...
హృదయాన్ని చెమర్చింది ఆయన నడిచిన బాట...

అమాయకత్వం అనేది మాత్రం నాకు నచ్చలేదు నీ నోట..
అది కేవలం ఆయన మంచితనం అనేదే ఆ వూరి మాట...

వారసుడిగా నీకు ఇచ్చారు అందమైన కుటుంబం అనే తోట..
ఇకపై అదే ఆయన ఆశయాలకు అనువైన పూదోట...

Mohan said...

బావ, మావయ్య లేరు అనే వార్త నన్నే దిక్బ్రాంతి కి గురి చేసింది ఇక నీ పరిస్థితి ఊహించగలను please నువ్వు దైర్యం గా వుండు

Every Emotion is a Business

B051/Business dated at Tadepalligudem the 28.12.T25 Business చాలా రోజులు అయింది. నిజానికి సంవత్సరాలు అయింది ఒక బ్లాగు రాసి. Youtube channel ...