Monday, April 25, 2022

End of the Day with Danger Signs.

B036 dated at Tadepalligudem the 25.04.T22.


365 రోజుల్లో ఆ ఒక్క రోజు. దానికి రెండు మూడు రోజుల ముందు నుంచి నేను ఒత్తిడికి లోనై ఆ రోజు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూసే రోజు. అదే ఈ రోజు. నా పుట్టిన రోజు.

నిరుడు నేను రాసిన Blog కి ఇది ముగింపు లేని కొనసాగింపు. అసలు నాకు నా పుట్టిన రోజు అంటే ఎందుకు అంత భయమో తెలియాలి అంటే దీనికి ముందు భాగం మీరు చదవాలి.


https://rajueckce.blogspot.com/2021/04/hey-birthday-its-my-wishes-to-you.html

నా ప్రతి పుట్టిన రోజుకి నాకు అసంతృప్తి ఉంటుంది. అది ప్రతి ఏటా పెరుగుతూ వస్తూనే ఉంది. ఈ సారి శిఖరాగ్రానికి చేరుకుంది. 

నాకు ఇలా పుట్టిన రోజు అని ముందుగా అందరికీ చెప్పుకోవటం ఇష్టం ఉండదు. నా పుట్టిన రోజు అని మిఠాయి పంచిపెట్టి దేవించమనే పద్దతి కూడా నచ్చదు. ఎవరికైనా గుర్తు ఉంటే ఏదో చెప్తారు. నేను కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాను. అది కూడా ఆ చెప్పే మనిషి బట్టి చెప్తాను. ఈ రోజు కూడా అలా చెప్పిన చాలామంది కి నేను ఏం చెప్పాలో తెలియక ముందు కాస్త ఆగాను. ఎందుకంటే ఒకసారి గుర్తు పెట్టుకుని చెప్పిన వాడు ఆ మరేడు గుర్తు ఉంచుకోడు. అదే నాకు నచ్చనిది. గుర్తు లేకపోగా నా మీద జాలి చూపిస్తాడు నేనేదో అడుక్కున్నట్టు. అది అసలు నచ్చదు నాకు. ఇందుకే నేను చాలా భారీగా భారాన్ని మోసే రోజు ఇదే. ఈ ఒక్క రోజూ ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా పారిపోవాలని అనిపించే రోజు. కానీ ఒక బాధ్యతాయుత స్థితిలో ఉండి అలా చేయలేక ఇలా ఉండిపోతున్నా. ముందు రోజు వరకు నా బిడ్డలు కూడా నా పుట్టిన రోజుకి హడావిడి చేస్తారు కానీ ఈ రోజు కనీసం శుభాకాక్షలు చెప్పమని వాళ్ల అమ్మ అడిగినా నాకు చెప్పరు. అదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా. ఇదేం అసలు పెద్ద విషయం కాదు. అసలు పుట్టిన రోజుకి విలువ ఇవ్వని వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను కూడా విలువ ఇవ్వను. కానీ ఇచ్చీ ఇచ్చినట్టు ఇవ్వనట్టు ఉంటూ చివరికి ఇవ్వకుండా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండటమే నా దౌర్భాగ్యం. 

Among all best friends in the world, I have THE best friends.

Among all my worse birthdays, this is my THE worst birthday.

ఎందుకంటే, ప్రతి పుట్టిన రోజు నేను depression కి మాత్రమే వెళ్తాను. ఈ సారి hospital కి కూడా వచ్చాను.

ఈ రోజు ఉదయం బాగానే గడిపేశా అనుకుని భోజనం చేసి కాసేపు నడుం వాల్చగానే ఎప్పుడూ ముద్దు ముద్దుగా మాట్లాడే నా పెద్ద బిడ్డ చెయ్యి విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలు అయింది. ఇంట్లో ఆడుకుంటూ ఎన్నోసార్లు కింద మీద పడే నా పిల్లలు ఈ రోజు కాస్త అదుపు తప్పారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ రోజు ముగిసే వరకు ఆసుపత్రిలోనే ఉండి నా కూతుర్ని రెప్ప కింద పాపలా చూసుకున్నాం. రాత్రంతా మెలకువగా ఉంటూ వెళ్ళమనే వరకూ ఇక్కడే ఉండాలి. మూడు నెలల ముందు మా నాన్నని ఇలా చుస్కున్నా. ఇప్పుడు నా పిల్లని. ఇక్కడ నేను మెచ్చుకోకుండా ఉండలేనిది నా కూతురి ధైర్యాన్ని.

ఇది తను నాకిచ్చిన పుట్టిన రోజు కానుక అనుకోవాలి. 

కొంత మంది నేను ప్రతి విషయం చాలా ఎక్కువ ఆలోచిస్తా అనుకుంటారు. కొంతమంది నేను అసలు ఏమి పట్టనట్టు ఉంటాను అనుకుంటారు. వాళ్ళకి స్పష్టీకరణ కు రావాల్సిన విషయం: నేను కూడా వాళ్ళలాగే సాధారణ మనిషిని.

నేను నా బిడ్డకు చెయ్యి విరిగింది అని స్టేటస్ పెడితే ఆక్షేపించారు ఒకరిద్దరు. ఈ రోజు నా పుట్టిన రోజు అని పెట్టుకునే వాళ్ళ కంటే ఇది కాస్త ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. 

ఇలా జరిగిందని మా నాన్నకి ఫోన్ లో చెప్తే మనకి దరిద్రం వెంటాడుతుంది అన్నారు.

మా ఆవిడ వాళ్ల అన్నకి చెప్తే పిల్లల్ని చూడకుండా ఏం చేస్తున్నారు అని తిట్టారు. ఇలా ఎవరికి వారు వారికి తోచినట్టు చెప్తూ ఉంటారు అని నాకు తెలుసు. చెప్పించుకోవటానికే కదా ఇలాంటివి జరిగేవి.

నాకిలా జరగగానే నన్ను శత్రువు గా భావించే ఇద్దరు ముగ్గురూ, నేను వాళ్ళని శత్రువుగా భావించా అని భ్రమించే అదే ఇద్దరు ముగ్గురూ, నేను నిజంగా శత్రువుగా భావించే ఆ ఒకే ఒక్కడు ఇలా అనుకోవచ్చు: బాగా జరిగింది బ్లా బ్లా బ్లా అని.

నాకు తెలిసి నేను ఎవరికీ ఏ అన్యాయం చెయ్యలేదు అంటూ డైలాగ్ లు నేను వెయ్యను. నాకు తెలుసు, మనకి అన్యాయం జరగాలి అంటే మనం ఒకరికి అన్యాయం చెయ్యనక్కర్లేదు. నీతి న్యాయాలు తప్పి చిన్న తప్పులు చేసినా చాలు, దేవుడు సరైన దారిలో నడిపించటానికి ఇలాంటి చురకలు వేస్తాడు అని. అలాంటి ఎన్నో తప్పటడుగులు నేను వేసాను. అవి ఆపటానికన్నట్టే ఇలా అయ్యింది అని నాకు అర్ధం అయింది. 

ఇది చదివే వాళ్ళే చాలా తక్కువ ఉంటారు అని తెలుసు, ఏది ఏమైనా, అలసిన మనసుతో పులిసిన శరీరంతో భారంగా రాసిన వ్యధ ఇది.ఎవరూ ప్రత్యేకంగా నొచ్చుకోవద్దు. ఇది అందరినీ కలిపి ఉద్దేశించి రాసిందే. 

చివరిగా నా విషయంలో ఏ మంచి జరిగినా అది నా పిల్లలకి, మిగిలినవి అన్నీ నాకు జరగాలి. 😧😭.

-eckce

5 comments:

JOHN ABRAHAM said...

జీవితమే ఒక ఉగాది...
మనకు నచ్చనిదే జరిగే ఇది...
కష్ట సుఖాలను కలిపేది....
అనుభవాలను పాఠాలు గా ఇచ్చేది...


ఎవరికి ఎవరు విరోధి..
నీ ఆలోచనే నీకు కావాలి ప్రేమావధి..
క్షణంలో మారిపోయేది ఈ విధి...
దాని కోసం కష్ట పెట్టకు నీ మది...

పోరాడుతూ దాటు ఈ కష్టాల నది...
అవతల ఒడ్డున ఉందిలే గొప్ప ఆనంద నిధి...

JAGAN said...

Sir. Ippudu mee ammayi/abbayi ki ela vundi

Avb1994 said...

నన్ను శత్రువు గా భావించే ఇద్దరు, ముగ్గురూ, నేను వాళ్లను శత్రువులు గా భావించా అని భ్రమించే అదే ఇద్దరు ముగ్గురూ.

ఇంత గొప్పగా ఎలా సర్🙏🙏🙏

Best lines , till date.

Mohan said...

ఈ కష్ట సమయం లో భగవంతుడు మీతో వుండాలని, పాప కు త్వరగా నయం కావాలి అని కోరుకుంటున్నాను. పాప ను చూడ్డానికి రావాలి అనుకుంటున్నాను

Srihagya💖 said...

I'm sorry ra🥺

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...