Saturday, August 21, 2021

Naming Convention

B031 dated at Tadepalligudem the 21.08.T21


పేరులో ఏముంది. అసలు నేముతో పనేముంది అనే నవీన సామెత వినే ఉంటారు. ప్రవర్తనతో పోలిస్తే పేరులో ఏమీ లేదేమో కానీ పేరును మాత్రమే పరిగణిస్తే అదే పెద్ద పని అవుతుంది.  అసలు ఈ పేరు పెట్టే సంసృతికే జోహార్. దేవుడు అన్నిటిని  సృష్టించిన తర్వాత వాటికి పేర్లు పెట్టించి వాటికో గుర్తింపు ఇచ్చాడు. అసలు పేరు లేకపోతే ఎలా ఉంటుందో అని ఊహిస్తే అది కన్ఫ్యూషన్ కి కేరాఫ్ అడ్రస్ అవుద్దేమో. ఎవరిని అయినా లేదా దేన్ని అయినా అది ఇది అని పిలిచినట్టు చెప్తే యే? పేరు లేదా అని అడుగుతారు. ఎందుకంటే వస్తువుకి కూడా పేరు ఉంటుంది. ఒకరి గుర్తింపుకి మనం పెట్టుకునే ఆనవాలే పేరు అనుకుంటే దానికి పేరు ఒక్కటే సరిపోదేమో. ఎందుకంటే ఒకే పేరుతో ఒకరు కంటే ఎక్కువ మందే ఉంటారు. ఉన్న ఆరు వందల కోట్ల మందికి అన్ని విడి విడి పేర్లు ఉండవుగా. పేర్లు ఒకేలా లేదా ఒకటే ఉండటం వల్ల హాస్పిటల్ లో రిపోర్ట్లే కాదు వాళ్ళ జీవితాలే మారిపోయిన సంఘటనలు కూడా ఉంటాయి. కొన్ని ఊర్లలో ఒకే పేరు వందల మందికి ఉంటుంది. మా ఊర్లో కూడా నా పేరుతో ఇంకో యాభై మంది ఉంటారేమో. ఒకే పేరుతో ఒకటి కంటే ఎక్కువ ఊర్లు కూడా ఉంటున్నాయి. వాటికి పిన్ కోడ్ ఇచ్చి వేరు చేసినట్టే మనిషికి ఏం కోడ్ ఇవ్వాలో. ఇలాగే చిన్నప్పుడు నేను ఒకసారి పేపర్ పెన్ను తీసుకుని నాకు తెలిసిన ఊర్ల పేర్లు అన్నీ రాసే పని పెట్టుకున్నాను. మా ఇంట్లో వాళ్ళని మా ఇంటికి వచ్చే వాళ్ళని వాళ్ళకి తెలిసిన ఊరి పేర్లు చెప్పమని అడిగి మరీ రాసాను. ఎందుకంటే పైత్యం అనుకుంటా. 


ఆ రోజుల్లోనే శనివారం ఈనాడు ఈతరం పేపర్ లో ఒకతను తన పేరు ఎల్లయ్య అని, వాళ్ళ నాన్న పేరు పుల్లయ్య అని, అందరూ ఎగతాళి చేసినా తన పేరు అంటే తనకి ఇష్టం అని, ట్రెండీగా పేరు పెట్టుకోకుండా పాత పేరు పెట్టుకోవటం ఇప్పటి ట్రెండ్ అని గర్వంగా చెప్పిన విషయం చదివాను. వీడికి నాకన్నా పైత్యం అనిపించింది.


నా పేరు కూడా అలాగే ఉన్నా కూడా నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నిజంగానే నా పేరు అంటే నాకు ఇష్టం ఉండదు. హై స్కూల్ లో అయితే నా పేరు మార్చుకుందామా అనిపించింది. నాకు ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయమంటే మెంటల్ సూట్ అవుతుంది పెట్టుకో అని చెప్పింది ఒక అమ్మాయి. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆరో తరగతిలో ఒక పిల్లాడి పేరు నచ్చి నాకు కొడుకు పుడితే అదే పేరు పెడదాం అనుకున్నా కానీ ఇప్పుడు అది ఔట్డేట్ అయింది. ఒకవేళ కవల పిల్లలు పుడితే ఒకడికి మా నాన్న పేరు పెడదాం అనుకున్నా కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ చేయటం నాకు ఇష్టం లేదు. ఎనిమిదేళ్ల ముందు కిషోర్ అనే నా ఫ్రెండ్ తనకి సన్నిధి అనే పేరు ఇష్టం అని తనకి కూతురు పుడితే అదే పేరు పెడతా అని అన్నాడు. నేను అది గుర్తు పెట్టుకుని అతనికి కూతురు పుట్టిన తర్వాత ఆ పాపని ఉద్దేసించి సన్నిధి ఎలా ఉంది అని అడిగే వాడిని. కానీ ఆ పాపకి సాధ్య అని పేరు పెట్టాడు. హాస్టల్ లో రమేష్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. యోగిత అనే పేరు ఇష్టం అనే వాడు. అలాగే అర్పిత అనే పేరు నచ్చింది అని ఒక అమ్మాయి చెప్పేది. నాకు తెలిసి వాళ్ల ప్రిఫరెన్స్ లు ఇప్పుడు మారిపోయి ఉంటాయి. నేను కూడా నా కూతురు పుట్టక ముందే పేరు పెట్టేసాను కానీ ఇప్పుడు అది కూడా మార్చెయ్యాలి అనిపిస్తుంది. ఇలా పదేళ్లకే మన ఇష్టాలు మారిపోతుంటే నూరేళ్లు ఆ పేరుతో పడాల్సిన పిల్లలు ఎలా ఉంటారనేదే నా ఆవేదన.


ఒకసారి ఒకతను తన ఇద్దరి కొడుకులతో మా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చూసి ఆశ్చర్యపోయాను. ఒకడి పేరు అభిషేక్, ఇంకొకడి పేరు అభిషేక్ బన్ను. ఒకడికి పెట్టడమే ఎక్కువ అనిపించే పేరు ఇద్దరికి పెట్టారేంటి సర్ అని అడిగితే అందుకే ఒకడికి బన్నుని తగిలించా అన్నాడు. 

ఒకామె వాళ్ళ పాపకి తుటోషణి అని పేరు పెట్టింది. ఇందులో కూడా కొన్ని సెంటిమెంట్ లు, కొన్ని కాంప్లికేషన్ లు ఉన్నాయి. టోషి అనేది కర్ణాటక లో ఒక దేవత పేరంట. తు అనే అక్షరం మీద పేరు పెట్టాలంట. అపుడు తుటోషిణి అని పెట్టాలి కదా అని అడిగాను. న్యూమరాలజీ బట్టి షణి అని పెట్టారు అంట. కానీ పిలవడం మాత్రం టోషి అనే పిలుస్తున్నారు. కొంతమంది పేరు వినగానే ఎవడ్రా పేరు పెట్టింది అని తిట్టాలి అనిపిస్తుంది. అలాగే కొందరిని మెచ్చుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు ఎవర్ని మెచ్చుకోవాలి అనిపించట్లేదు. నన్నే అందరూ మెచ్చుకునేలా మంచి పేరు పెట్టాలి అనిపిస్తుంది. కానీ అది జరిగేలా లేదు. నా మట్టుకు నాకు గ తో ఉండే గిరి, గోపి, యోగి లాంటి పేర్లు ఇష్టం ఉండవు. నా తోడి వయసు వాళ్ళు ఎవరైనా మంచి పేరు పెట్టుకుంటే ఇలా ఆలోచిస్తా నేను. అరెరే వాళ్ల పేరెంట్స్ అప్పటికే అప్డేట్ అయ్యారే 30 ఏళ్ల ముందే ఈ కాలానికి సరిపోయే పేరు పెట్టారు అని. ఈ మధ్య కాలంలో నాకు కొత్తగా అనిపించిన ఒక పేరు వితుర్వ. ఓ పాతికేళ్ల అమ్మాయి పేరు అది. అర్ధం తెలియదు కాని ఆ పేరు చాలా తక్కువ మందికి ఉందని చెప్పగలను. అంటే మనం పెట్టుకునే పేరు ఈ కాలానికి సరిపోయేలా ఉండాలి అంటే దాదాపు ఒక తరం ముందే ముందు చూపుతో ఆలోచించాలి అన్నమాట అని అర్ధం చేసుకున్నాను. జీవితంలో మళ్ళీ మళ్ళీ మార్చుకోలేని వాటిలో పేరు ఒకటి కాబట్టి ముప్పై ఏళ్ల తర్వాత నా కొడుకు ఇలా ఇంకో బ్లాగ్ రాయకూడదు అంటే ఇప్పుడే 2050 కి తగ్గట్టు పేరు పెట్టాలి అనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు కూడా పేరు పెట్టలేకపోయాను. ఎవరిని అడిగినా ఎవరికో ఉన్న పాత పేర్లే చెప్తున్నారు కానీ నాకు కావాల్సిన కొత్త పేరు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినా నాకు నచ్చట్లేదు. నేనేమైనా కొత్తగా అలోచించి ఒక పేరు చెప్తే మాత్రం అందరూ వింతగా పెదవి విరుస్తూ నన్ను డిజప్పోయింట్ చేస్తున్నారు. ఇన్ని నెలలు ఆగింది ఇలాంటి పేరు పెట్టడానికా అనేలా పేర్లను సలహాలు ఇస్తున్నారు అందరూ. అందరికి నచ్చే కొత్తపేరు వెతకలేక, అందరూ చెప్పే పాత పేర్లలో ఏదొకటి పెట్టలేక నేను నా కొడుక్కి పేరు పెట్టలేనా అని భయం వేస్తుంది. కొన్నాళ్ల తర్వాత వాడికి నచ్చిన పేరే పెడితే సరిపోతుంది అనిపిస్తుంది. పెద్దయ్యాక నేను పెట్టిన పేరుతో పాటు నన్ను కూడా తిట్టే అవకాశం వాడికి ఇవ్వకూడదు కదా. 


ఇప్పటి వరకు ఎవరూ పెట్టనంత కొత్తగా, అందరూ మెచ్చే అంత వింతగా నా కొడుకు పేరు ఉండాలి అనుకోవటం నా అత్యాశ కాదు కాని నా ఆశని అడియాస చేసి నన్ను నిరాశ పరచి నాది దురాశ అనటం మాత్రం మీ దురుసే.


పేరులో ఏముంది నేముతో పనేముంది అనే ముందు, బ్రాండ్ అనే పేరుతో కొన్ని పేర్లకి మనం ఇచ్చే విలువని బట్టి తెలుస్తుంది పేరులో ఏముందో. పేరు మోసిన కొన్నిటి పేర్లను కాపీ కొట్టి కాస్త అటు ఇటుగా మార్చి పేరు సంపాదిస్తూ పేరు పలికిన ఇంకొన్నిటిని చూస్తేనే తెలుస్తుంది పేరుకి ఎంతుందో.



-eckce

Saturday, July 31, 2021

Favorite TV Ad

B030 dated at Tadepalligudem the 31.07.T21

చిన్నప్పటి నుంచి టీవీ లో ఎన్నో యాడ్స్ చూసాం. మనకి బాగా గుర్తిండిపోయే యాడ్స్ కూడా కొన్ని ఉంటాయి. నాకు అయితే 2000  సంవత్సరానికి అటు ఇటులో క్రికెట్ మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్ ఒకటి బాగా ఇష్టం. సచిన్ టెండూల్కర్ ఫీల్డింగ్ చేస్తూ బాల్ క్యాచ్ చేయటానికి పరిగెత్తుతూ తన క్యాప్ పడిపోయినా పట్టించుకోకుండా గాల్లోనే ముందుకి దూకి ఒక్క చేత్తో బాల్ పట్టుకుంటాడు. పక్కనే బూస్ట్ డబ్బా ఉంటుంది. దీనికి కారణం బూస్ట్ అని చెప్తాడు. ఇది ఎందుకు నచ్చింది అంటే క్యాప్ పడిపోయినా పట్టించుకోకుండా బాల్ కోసం పరిగెత్తడం, ఎగిరి క్యాచ్ పట్టడం వలనే. ఆ తర్వాత వేరే ఒక లైవ్ మ్యాచ్ చూస్తున్నాం. అది ఇండియా ఆడే match కాకపోయినా అప్పట్లో సోకిన క్రికెట్ జ్వరం వల్ల ఎవరు ఆడినా చూసేసేవాళ్ళం. ఏ దేశపు పోటుగాడో గుర్తులేదు కాని ఒక ఆటగాడు ఇలాగే బాల్ కోసం పరిగెత్తుతుండగా తన క్యాప్ గాలికి ఎగిరిపోతే ఆ క్యాప్ తీసుకుని తలకి పెట్టుకుని అప్పుడు బాల్ కోసం మళ్ళీ పరిగెత్తాడు. చాలా నవ్వొచ్చింది నాకు బూస్ట్ యాడ్ లో సచిన్ కి ఉన్న డెడికేషన్ కూడా లేదేంటి అని. ఇంకా ఎన్నో యాడ్స్ ఉన్నప్పటికీ నన్ను ఎంతో హత్తుకున్న యాడ్ మాత్రం ఒకటుంది. 2011 లో లేదా ఇంకా కాస్త ముందో వెనకో నేను అది చూసాను. ఈ మధ్యన కూడా చూసినట్టే గుర్తు.


అందులో ఒక ధనవంతుడు సూట్ వేసుకుని కార్ వెనక సీట్లో కూర్చుని రోడ్ పై వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతాడు. పక్కనే ఒక కుర్రాడు సైకిల్ తొక్కుతూ కాస్త మాసిన బట్టలతో చెమటలు పట్టిన మొహాన్ని చేతులతో తుడుస్తూ ఆ కార్ పక్కనే ఆగుతాడు. ఆ ధనవంతుడు ఈ కుర్రాణ్ణి చూసి ఎక్కడెక్కడి నుంచి వస్తారో అని తనలో తానే విసుక్కుంటూ కార్ అద్దం ఎత్తేస్తుండగా అది గమనించిన కుర్రాడు కాస్త ఆలోచించి ఆ ధనవంతుడి ఆహార్యం చూసి హాండ్ కఫ్స్ పెట్టుకుని తన జేబులో ఉన్న టై కట్టుకుని షర్ట్ పాంట్ లో tuck in చేసి ఒక డైలాగ్ చెప్పి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతుండగా ఆ ధనవంతుడు అద్దం దించి ఆ కుర్రాణ్ణి గర్వంగా చూస్తాడు. వాడు చెప్పిన డైలాగ్ ఏంటనే కదా సందేహం: కేవలం రెండు చక్రాలే తేడా అంకుల్, వచ్చేస్తాయ్ అని స్టైల్ గా చెప్తాడు. ఇక్కడ ఆశ్చర్యంగా అనిపించే విషయం వాడు తన ఆహార్యం మార్చుకోగానే మాసిన బట్టలు తెల్లగా మారిపోతాయి. దీనికి సమాధానమే ఎండింగ్ లైన్స్ లో చెప్తాడు యాడ్ రూపకర్త. ఆ కుర్రాడు తన future ని చాలా confident గా predict చేసాడు అనొచ్చు లేదా అప్పుడే ఒక goal పెట్టుకుని బలమైన  సంకల్పం పొందాడు అనుకోవచ్చు. ఏది ఏమైనా మంచి counter అయితే ఇవ్వగలిగాడు. ఇంతవరకు జరిగిన సోది కాదు గాని నాకు నచ్చిన మాటలు ఆ చివర్లో వచ్చినవే. కేవలం ఉద్దేశాలలో ఇంత తెల్లదనం ఉన్నప్పుడు బట్టలలో ఎందుకు ఉండకూడదు?

ముందు జరిగినది అంతా వదిలేద్దాం. ఆ ఒక్క  మాట మళ్ళీ రాస్తున్నా. ఉద్దేశాలలో ఇంత తెల్లదనం ఉంటే బట్టలలో ఎందుకు ఉండకూడదు? ఇది తెలుగు యాడ్ అవ్వటం వల్ల నాకు అంత బాగా కనెక్ట్ అయింది. వేరే భాషల్లో, అంతెందుకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో కూడా when your ambition shines so much why should your clothes be any different? అని రాసాడు. Ambition అంటే ఉద్దేశం కాదు. కానీ ఉద్దేశం అనే మాటకు ఉన్న బలం ఏ మాటకి రాదు. ఎందుకో చెప్తా. దానికంటే ముందు అసలు విషయం చెప్పాలి, ఇది RIN Radiant బట్టల సబ్బు యాడ్.


మన అందరం ఎన్నో మాటలు వింటాం, మనమూ వినే వాళ్ళకి చెప్తాం. కానీ అవి ఎంత వరకు మనస్ఫూర్తిగా లేదా నిజాలు చెప్తున్నాం? ఖచ్చితంగా మీ ఊహకు అందనంత తక్కువే చెప్తాం. నూటికో నోటుకో ఒక్కడు ఉంటాడు అన్నీ నిజాలు చెప్పేవాడు. అలాంటివాడి కష్టాలు ఎవడికీ రాకూడదు అని జాలి పడేలా ఉంటుంది అన్ని నిజాలు చెప్పే వాడి జీవితం. కానీ ఏ మాటకి ఆ మాట, మనం ఒకటి చెప్తున్నాం అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం కూడా అదే అయ్యున్నప్పుడే ఆ మాటకి, ఆ మనిషికి విలువ. మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోవటం కోసమో, అవతలి వాడిని impress చెయ్యటానికో, వాడికి నచ్చటం కోసమో మాట్లాడితే దాన్నే కదా డబుల్ యాక్షన్ అంటారు. ఇలా చేసే మన లాంటి వాళ్లందరికీ eckce అనే blogger గా చెప్తున్నాను. దీన్నే కదా మోసం అంటారు. పక్క వాళ్ళని ఎలాగూ మోసం చేస్తావు, నిన్ను నువ్వు కూడా మోసం చేసుకుని ఎవరిచ్చే Oscar పొందుతావు? నీ వల్ల పక్కవాళ్ళకి ఉపయోగం ఉండాలి. అదెలాగు జరగదు. కనీసం నిన్ను నువ్వు మోసం చేసుకోలేదు అనే సంతృప్తి అయినా నీకు మిగలాలి కదా. అది కూడా లేకపోతే నీ మాటల గారడీతో దాచిపెట్టి నెరవేర్చుకున్న నీ ఉద్దేశానికి సరైన నిర్దేశం లేక నిర్దోషిలా నిలబడలేవు.


నువ్వు మంచి వాడివా? అయితే మంచిది. కాదా? నువ్వు మంచివాడివి కాదా? అయినా మంచిదే. అదే అందరికీ తెలియనివ్వు. అంతే కాని లేని మంచి నటించకు. పాటించని మంచి మాటల్లో చూపించకు. నువ్వేంటి అనేది అలాగే చూపించినప్పుడే కనీసం నీ నిజాయితీని లోకం మెచ్చుకుంటుంది. నటిస్తే నమ్మే అమాయకులున్న కాలం కాదిది. నీ నటనను నమ్మినట్టు మేము కూడా నటిస్తాం అంతే. నీ వెనక మేము కూడా నీ లాగే నిన్ను తిట్టుకుని మా ఉద్దేశాల్ని బయటపెట్టుకుంటాం. చూసావా, నీ నటన వల్ల మేము కూడా నటించాల్సి వస్తుంది! ఎవ్వడు తక్కువ కాదు అందరూ నటులే. దీన్ని తగ్గించాలి అంటే ఉద్దేశాల్ని దాచుకోకూడదు. మంచిదైనా చెడ్డదైనా ఉద్దేశమే మాట్లాడాలి. ఉద్దేశాల్లో ఉన్న తెల్లదనం బట్టల్లో కనిపించినట్టే మనసులో మంచితనం ఉన్నప్పుడే బయటకి మంచిగా మాట్లాడాలి. అప్పుడే లోకం అద్దం దించి నిన్ను  చూసి గర్విస్తుంది. అంతే కాని లోపల కుళ్లు పెట్టుకుని కూడా బయటకి మంచి మాటలతో మోసం చేస్తే అదే విధంగా మనమూ మోసపోతామని తెలుసుకోవాల్సిందే. ఇక ఇదే చక్రం అవుద్ది. 

చివరిగా ఒక్కమాట: ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి రాసింది కాదు. రాస్తున్న, చదువుతున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఉద్దేశించి రాసిందే. నా ఉద్దేశం తెల్లగానే ఉంది మరి. ఇక మీదే.


- ecKce.

Monday, July 26, 2021

Confusion

B029 dated at Tadepalligudem the 26.07.T21


చుట్టూ ఏదో జరుగుతున్నట్టు తెలుస్తున్నా స్వచ్ఛమైన స్పష్టత లేదు. కప్పుకున్న పొరలతో కళ్ళు బైర్లు కమ్ముకుని ఏదీ ఆరా తియ్యలేకపోతున్నాయి. జరిగేదేదో జరిగింది మనకెందుకు అనుకునే పరిస్థితి లేదు. జరుగుతున్నవన్నీ ప్రతికూలంగానే ఉన్నట్టు ప్రత్యక్షం అవుతున్నా ఆపటానికి ఏం చెయ్యాలో తోచట్లేదు. మొదలు పెట్టిన పని ఏది పూర్తి చెయ్యలేకపోయేంత పరధ్యానంలో  ఉంటున్నా. ఆగిపోయిన ఆలోచనలు, వాయిదాలో ఉన్న పనులు, ఇంకా ఎన్నో అశ్రద్దపాలు. ఈ దుష్ప్రభావాలను గుర్తించకుండానే రోజులు వాటికవే గడిచిపోతున్నాయి. చేస్తున్నది ఏదీ ఉపయోగపడేది కాదు. చెయ్యమని మనసు ప్రలోభపెట్టట్లేదు, అలాగని ఆపట్లేదు. వ్యాసనాలకలవాటు పడిన మనసు అసలైనవి మర్చిపోయింది. ఈ అనుభవాలను నేను గుర్తించటానికే చాలా సమయం పట్టింది. చాలా కోల్పోవాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో ఇదే తీరుగా ఉన్నాను. తేరుకోవాలి అనుకున్నా ఇప్పటికీ అలాగే ఉంటున్నాను.


నేనిలా ఉంటున్నా అని ఆలోచిస్తే గాని నేనెలా ఉంటున్నానో తెలియట్లేదు. నేనిలా ఎందుకున్నా అని తలుచుకునేంత తీరిక లేదు, అలాగని చేస్తున్న పని ఏంటనే ధ్యాస లేదు.


నాకైతే ఇప్పుడు తెలిసింది. కానీ చాలామందికి ఎప్పటికీ తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను మాత్రమే మనిషి కాదు. ఇలాంటి స్థితిలో అందరూ ఎప్పుడోకప్పుడు, లేక ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు. కానీ వారు ఉన్న మత్తు గురించి వారికి కూడా తెలియదు. ఉన్నవి కోల్పోయాక కూడా తెలియదు. ఎందుకంటే మన అందరి కన్నులకి కొన్ని పొరలు తెరలుగా పనిచేస్తూ అసలు మనం ఏం చెయ్యాలి అనేది తెలుసుకోకుండా చేస్తాయి. నేను ఇలా ఉంటున్నది గత కొన్ని నెలలుగా మాత్రమే. కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండేవారు ఉంటారు. ఒకవేళ నేను కూడా అదే జాబితాలోకి రావొచ్చు కూడా.


మనలని సరిచేయాలి అని ప్రయత్నించేవాళ్ళు కూడా మనకి శత్రువుల్లా కనిపించే గత్యంతర స్థితిలో మనం ఉంటాం. కానీ వింతగా మిగిలిన వాళ్ళని సరిచేసేయ్యాలి అనుకుంటాం. ఉదాహరణకు నాకు రాయటం అంటే ఇష్టం కానీ చదవటం కాస్త కష్టం. కొంతమంది చెప్పమంటే ఆపకుండా చెప్పగలరు కానీ ఓపిగ్గా వినలేరు. పైగా ఆ చెప్పేవాడినే తప్పు పడుతూ మధ్యలో ఆపుతారు. ఇది హ్యూమన్ టెండెన్సీ. సరి చెయ్యటం మీద నాకు బాగా ధ్యాస ఎక్కువ. కానీ అందులో కొంత కూడా నన్ను నేను సరి చేసుకోవాలి అనుకోవటంలో ఉండదు. నేను ఎన్నో కలలు కన్నాను కానీ వాటిని నిజం చేసే ప్రయత్నం నా వైపు నుంచి ఉంది అనుకోను. నా తిరోగతికి నేనెంత కారణమో నాకు తప్ప ఎవరికి తెలియదు. కానీ నేను ఇది తెలుసుకున్నా కూడా మార్చుకోలేను. ఎందుకంటే నా అభివృద్ధి నా ఆలోచనల్లోనే, నా కలల్లోనే ఆగిపోయింది. నా గురించి నాకు 100% తెలుసు అని నేను అనుకోవటం 1000% సరైనది. కానీ దాన్ని నిరూపించే ఆధారం కానీ కాదంటే అవుననే ఆరోపణ కానీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు.


ఇదే ఇప్పటి సమస్య. నమ్మకం ఉంటుంది కాని సాక్ష్యం ఉండదు. ఆశయానికి చేరుకోవాలనే ఆశ ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు. ఇది అందరి సమస్య. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్న నేను నాలో ఏం జరిగి ఉంటుందో కనిపెట్టలేని నేను నాకేమైందో ఎలా పసిగట్టగలను? కానీ నాకున్న ఇంగితమాధారంగా నేను సరిగ్గా లేనని నాకు రూఢిగా తెలుసు. సరిగ్గా ఉండటం అంటే ఏంటో కూడా తెలుసు. కానీ దాని కోసం ప్రయత్నించాలని లేదు. ఇలాగే అస్తవ్యస్తంగా అర్ధరహితంగా ఉండిపొమ్మని కొన్ని శక్తులు నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. లేచి పరిగెత్తాలనే ఆశ ఉన్న అవిటి వాడిలా ఉన్నాను.


కొన్ని బలహీనతల వల్ల ఎన్నో బాధ్యతలు వదిలిపెట్టి ఇంకెన్నో బాధల్ని తెచ్చుకుంటూ కాలం గడిపేస్తున్న ఎంతో మందిలో నేను ఒకడిని. పరిష్కారం ఉన్నా ఇంకా సమస్యగానే ఉండాలనుకుంటున్నా. కానీ నాకు తెలుసు. ఇది కొన్నాళ్లు మాత్రమే. నేను జయిస్తాను. పూర్తిగా కాకపోవచ్చు. కానీ నన్ను నేను తృప్తి పరచుకునేంత అయినా సాధిస్తాను. మళ్ళీ వస్తాను.


-eckce.

Saturday, July 3, 2021

First Job

B028 dated at Tadepalligudem the 03.07.T21.


సరిగ్గా నెల రోజుల ముందు ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాను.


బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని పట్టాల రైలు ఎక్కి పట్నం బయలుదేరి పదేళ్లు అయింది అని.


దానికి కొనసాగింపుగా ఇదే రోజు పదేళ్ల ముందు జరిగిందో రాసి అప్పట్లో ఒకచోట share చేసాను. ఇప్పుడు ఇక్కడ reshare చేస్తాను.


A  Painful Success Story


I fixed alarm for this morning at 6.24 AM.

But I woke up at 7.39 Am.

I don’t even have a copy of resume.

I don’t have an ironed shirt.

I started and went 2 Maadhapur in hyderabad.

I walked 4 10 min and searched 4 an internet cafe opened.

I wasted 30 min and asked a travel agency receptionist if he has a printer.

I requested him and had a copy of resume 4m pen drive.

Later I went to Mind Space by 2 autos.

I had got off the auto at building# 1, but had 2 reach building# 14.

I asked every security people and reached my target.

I should go to 4th floor. I was going to lift, some security person enquired me.

I answered "I CAME FOR ZENQA INTERVIEW".

He asked me 2 sign on register along with my serial number which could

be available on the short listed roll.

Shocking. My name was not there. But I got the call letter 4m JKC.

The content of that letter was inviting me 2 attend ZenQA today.

It added 2 come with the print out of that call letter, ID proof and

updated resume.

I went there with my voter ID Xerox instead of JKC ID card or College ID card.

Any how the security person allowed me to go to 4th floor.

There I could find the roll list again at reception.

Shocking again, I found my village name instead of my name.

Receptionist asked 2 wait until the manager come.

He even was checking the call letter whether it’s ours or not.

I made my call letter printed without to address such that there is no

proof that it is mine.

I waited for 40 min there and manager came and conducted written test

to the students inside the office.

I fixed myself that I have to go from there.

Manager came 2 me and I explained the situation showing my voter ID

proof in which my village name is there.

I was sent inside.

Aptitude test was conducted for an hour. I completed it successfully

and was confident.

After 20 min results were announced.

I was qualified 4 next round which was C-Test.

I was not satisfied with my performance.

By God' s grace I was qualified 4 next round Interview.

Along with me, our college mate Shanmuk C.S.E was also qualified.

Next we were fed with puff, sandwich and a glass of slice.

I had no other file with him, except my voter ID Xerox while remaining

had their files with them.

I was at no. 15 to be called for interview.

Interviews started at 3.05 at 2 panels.

We were in discussions whether it is Tech HR or HR or both once or one

after other.

I entered panel and a man without moustache and with red T-Shirt interviewed me.

He did not even ask me 2 introduce myself.

A-Z technical and he had a glance at my dot net certification.

He asked me where my interest is and I told Development even though it

is a Testing based company and recruiting freshers only to test

projects of clients in U.S, U.K and Canada.

I was shocked again after knowing that I must give them a commitment

of 2 and half years to work there.

I decided to leave that even if I was selected.

When I was thinking this, I was called again 2 attend another panel

being interviewed by C.E.O of ZenQA.

This time I was discussing with him about 20 minutes. I was 3rdd

person called 4 2nd panel of interview.

After calling 8 more people to interview, results were given.

I WAS SELECTED.

I WAS SELECTED.

I WAS SELECTED.

6 weeks is the prohibition period after which I have 2 sign a bond of

2.5 years if my work satisfies them.

Total 5 members were selected out of which our college mate Shanmukh is one.

We are all Test Engineers.

After a discussion of 15 min, I was called personally by the Red

T-shirt person who interviewed me in Panel-1.

Shocking again he promised me that I will be Software developer if I

prove myself in prohibition period.

After 20 min we all were given offer letters, I was declared as

SOFTWARE ENGINEER as remaining were Software test engineers.

I remembered the words that I had given my mom “I will be placed

within 1 month” before one month.

I (We) have to join tomorrow.

My salary is 14000 per month up to 6 months and will be 18000 per month later.

In between every round I prayed 2 God.

God blessed me.

Anyway tomorrow is my first day of Job.


ఆ రోజు ఇదంతా టైప్ చేసి facebook లో పోస్ట్ చేస్తుంటే లెంగ్త్ ఎక్కువైంది అని మా క్లాస్ గూగుల్ గ్రూప్ లో షేర్ చేశాను.

Mistakes ఉన్నప్పటికీ అప్పుడు నా ఇంగ్లీష్ ఇలా ఉండేది అని తెలుసుకొని దాని essense కోల్పోకూడదని as it is కాపీ చేశా.


-eckce

Friday, June 18, 2021

Untitled without Subtitles

B027 dated at Tadepalligudem the 18.06.T21.


ఏదో చెయ్యాలి అనుకుని చెయ్యలేకపోతూ ఉండటం, చేయలేదని బాధ పడటం జరుగుతూనే ఉంటాయి. కానీ అది ఎందుకు చేయలేకపోయాము అని మనకి మనం సమాధానం చెప్పుకొనే స్థితిలో అయినా ఉంటే అది చాలు. ఎందుకంటే కారణం బలంగా ఉంటేనే కదా కార్యరూపం కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన దానికి అర్ధం ఉంటుంది. నేను గత రెండు నెలలుగా ఎన్నో రాయాలి అనుకున్నాను. కానీ ఒకటి కూడా రాయలేకపోయాను. రాసే ఖాళీ లేక కాదు, నా రాత ఖజానా లో ఖలేజా లేక. ఇప్పుడు రాస్తున్నానంటే కళాఖండం ఏదో ఉందని కాదు, ఎందుకు రాయట్లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంతే. సారాంశం చివర్లో. 

చిన్న చిన్న అంశాలు ఎన్నో నన్ను కదిలించినప్పటికీ దానికి తగిన పెద్ద పెద్ద అనుభవాలు నాకు లేకపోవటంతో పూర్తి అవగాహన సంపాదించుకోలేకపోయాను. అయినా మన అభిప్రాయం చెప్పటానికి క్షుణ్ణమైన జ్ఞాన పరిణీతి అక్కర్లేదని ఒకవేళ అది మనకి ఉన్నప్పటికీ అందరూ దానితో ఏకీభవించరు అని నాకు తెలుసు. కానీ ఒక బలమైన అనుభూతి ఏదో నాకు కలిగించినప్పుడో లేక బలవంతంగా ఎవరైనా  నన్ను కదిలించినప్పుడోనే కదా నేను ఇక్కడ కనిపించేది. అందుకే ఆగిపోయాను. కానీ ఇంక ఆగే పరిస్థితి లేదు, సాగే సంస్కృతి తప్ప.


చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్న కొంతమందికి ఒక మంచి విషయం చెప్తే చక్కగా ఊ కొడతారు కానీ ఆచరణలో పెట్టడానికి ఎందుకు శ్రద్ధ పెట్టరో అర్ధం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తే బాధ పడతారనో, లేక మొత్తానికి వ్యతిరేకత చూపి కోప్పడతారనో భయపడి చెప్పకపోవటం వల్ల వాళ్ళు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారనే అసంతృప్తి మనకి అలాగే ఉండిపోతుంది. అయినా చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకునే హుందాతనం చాలా తక్కువ మందికి ఉంటుంది. అహంకారానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్లు మాత్రమే మనం చెప్పే మంచిని మంచి అని నమ్మి స్వీకరిస్తారు. కానీ కొంతమంది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయానికి ఎక్కువ విలువివ్వటం వలన మన మాట పెడ చెవిన పెడతారు. ఎందుకంటే మనం చెప్పే మంచి కంటే కూడా వాళ్ళు చేసేదే మంచిదని వాళ్ళు నమ్మడం వలన మన మాటలు వినరు. ఒక్కోసారి వాళ్లే కరెక్ట్ అవ్వొచ్చు కూడా. అప్పుడు మనమే అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది. మన మీద నమ్మకం లేని వాళ్ళు కూడా మన మాట వినరు. కానీ ఇది చాలా తక్కువ మంది విషయాల్లోనే జరుగుతుంది.

మరి కొంతమందికి వాళ్ళు చేసేది తప్పు అని తెలిసినా, మనం మంచి చెప్పినప్పుడు విని తర్వాత కావాలనే మర్చిపోయి మనల్ని విసిగిస్తారు. దీనికి కారణం వాళ్ళకి వినదగిన చెవులున్నప్పటికీ ఆచరించే ఆలోచన ఉండదు. అందుకే కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యరు. ఇలాంటి వాళ్లనే నేను ఎంతో మందిని ఇంటా బయటా చూస్తూనే ఉన్నాను.

ఒక్కటి మాత్రం నిజం, ఒకరి దృష్టిలో మనం సంపాదించిన స్థానం, వారికి మనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చటం అది మొదటిగా ఏర్పరుచుకున్నంత సులువు కాదు. మనపై పడ్డ చెడ్డ ముద్రని చెరిపెయ్యటానికి మనం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్కోసారి సరిపోదు. కానీ మనపై పడ్డ మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోవటానికి మాత్రం ఒక్క అపార్ధం చాలు.


ఇప్పుడు నేను రాసిందంతా రాజ్యాంగం కాదు. అందరికీ ఇదే అభిప్రాయం ఉండదు, ఎందుకంటే అందరికీ ఉన్న కామన్ సెన్స్ నాకున్న నాన్ సెన్స్ తో సమానంగా ఉండదు కాబట్టి వారి ఆలోచనలు, విధానాలు వేరుగా ఉంటాయి. 

ఇలా ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో ముగించాల్సిరావటం వలనే ఇన్ని రోజులు రాయలేకపోయాను అనే ముగింపు వాక్యంతో ఈ అంశాన్ని ఇక్కడితో అంతం చేస్తున్నా.


-eckce

Monday, April 26, 2021

Hey birthday, it's my wishes to you.

B26 dated at Tadepalligudem the 26.04.T21


నాకు పదేళ్లు ఉన్నప్పుడు ఒక రోజన మా అక్క పుట్టినరోజు వచ్చింది. మా ఇద్దరికీ ఐదేళ్లు తేడా. ఆ రోజు మా అక్క చేత చిన్న బుట్ట కేక్ కట్ చేయించారు మా ఇంట్లో. ఒక పుట్టినరోజు అలా చేయటం అదే మొదటిసారి మా ఇంట్లో. ఇదేదో బాగుంది ఇంకో 12 రోజుల తర్వాత తమ్ముడి పుట్టినరోజు వస్తుంది కదా అది బాగా చేద్దాం అని మా అక్క అన్నది. అబ్బా టీవీ, సినిమాల్లో చూసాను, నేను మా ఇంట్లో కేక్ కట్ చేస్తాను అనే ఆలోచనే నాకు సిగ్గు (ఆనందంతో పడే సిగ్గు లే) తెప్పించింది. ఆ రోజు రానే వచ్చింది. అర కేజీ కేక్ తెచ్చి ముందు రోజు రాత్రే ఫ్రిడ్జ్ లో పెట్టారు. మా అమ్మమ్మ, తాతయ్య కూడా మాతోనే ఉన్నారు. తలస్నానం చేసిన తర్వాత అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాము అందరం. అప్పుడు అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన మా ఉత్సాహాన్ని, ముఖ్యంగా నా ఉద్రేకాన్ని అణచివేసింది. నా మొహం మాడిపోయింది. ఇంక వేడుక పావంతరంగా ఆగిపోయింది అనుకున్నాను. నన్ను చూసిన మా వాళ్ళు వేదిక సిద్ధంగానే ఉంది, వేడుకకి ఆటంకం ఏం లేదు అని అర్ధం వచ్చేట్టు నన్ను ఓదార్చారు. కేక్ కోసా, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నా. చాలా ఇబ్బందిగా అలా చేశా. ఆ అలవాటు కానీ అనుభవం కానీ ముందు లేవు. ఆ సమయంలో పొందాల్సిన అనుభూతి ఎలా ఉంటుందో, ఎలాంటి ప్రతిచర్యకు పాల్పడాలో తెలియదు. తర్వాత చోకోలేట్స్ పళ్ళెంలో వేసి అందరికి నన్నే పంచమన్నారు. అది కూడా ఇబ్బందే నాకు. ఎందుకంటే అవి ఇస్తూ ఈ రోజూ నా పుట్టిన రోజు అని వాళ్ళకి నేనే చెప్పటం నాకు అసలు నచ్చలేదు. నా కొడుకు పుట్టినరోజు అని మా వాళ్ళే అందరికి చోకోలేట్స్ పంచాలి అనే ఫీలింగ్ లో నేను ఉన్నాను అపుడు. మొత్తానికి విఘ్నంతో మొదలయ్యి ఇబ్బందిగా ముగిసింది నాకు జరిగిన మొదటి పుట్టినరోజు పండగ.

తర్వాత ఎవడు నాకు పుట్టినరోజు జరిపిన దాఖలాలు దగ్గర్లో లేవు. ఎందుకంటే ఇంట్లో మళ్ళీ చెయ్యలేదు. స్కూల్లో చేసే అవకాశం లేకుండా ఆ టైమ్ కి వేసవి సెలవులు ఇచ్చేసేవాళ్ళు. ఇంక నాకు మంచి అభిప్రాయం కూడా లేకుండా పోయింది వాటి వల్ల. కొంచెం వయసు వచ్చాక, పుట్టినరోజు కి విషెస్ చెప్పటం, వాళ్ళకి ఆనందం ఇవ్వటం అలవాటు చేసుకున్నా. తర్వాత వేరేవేరే వాళ్ళతో విషెస్ చెప్పించి మరింత ఆనందపరచటం నేర్చుకున్నా. నాకున్న జ్ఞాపకశక్తి వల్ల అందరి పుట్టినరోజులు బాగా గుర్తు ఉండేవి. నేను గుర్తుపెట్టుకొని వాళ్ళకి విషెస్ చెప్పటం చెప్పించటం ఇలా సాగిన రోజులు బాగుండేవి. కాలేజి రోజుల్లో పుట్టినరోజులు వస్తే సాయంత్రాలు క్లాసుల్లోనే పండగ చేసుకోవటం, బయటకి వెళ్ళటం, తాగటం, తినటం ఇవన్నీ కూడా బాగుండేవి. అప్పట్లో ఫోటోలు, ఆ మొహాలు ఇప్పుడు చూడాలి.


ఎప్పుడైతే నేను ఈ నెలలో పుట్టానో నా పుట్టినరోజు గుర్తు పెట్టుకునే అవకాశం, వేడుక చెయ్యాలనే ఆలోచన ఎవరికి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడే exams అవుతాయి. ఇంక ఆ సెలవుల టైమ్ కి నేను ఇంట్లోనే ఉండాలి. నేను అందరి పుట్టినరోజులు గుర్తు పెట్టుకొని విషెస్ చెప్పటం, నా పుట్టినరోజు ఎవరికి గుర్తు ఉండకపోవటం ఎక్కడా బేరీజు కుదిరేది కాదు. దీనివల్లే నేను నన్ను అందరూ నిర్లక్ష్య పెట్టారనే భావనలో ఉన్నాను. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ కొంత మాత్రం నాకు ఈ పుట్టినరోజు మీద ఉన్న భిన్నాభిప్రాయం మరియు అందరూ నాలాగే ఆలోచించాలి అనుకునే నా తత్వమే కారణం. నా పుట్టినరోజు ఇది అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడను. నేను వాళ్ళ పుట్టినరోజు తెలుసుకున్నట్టే వాళ్లు ఎందుకు నా గురించి తెలుసుకోరు అని ఆలోచించాను కొన్ని సంవత్సరాలు. అయినప్పటికీ నా జీవితంలో ఇప్పటి వరకు ఆరు సార్లు కేక్ కట్ చేసినట్టు గుర్తు నాకు. నా చేత అలా చేయించిన వారికి నా జోహార్లు. 

ఆరేళ్ళ ముందు అసలు ఈ పుట్టినరోజు కథ ఏంటి అని తెలుసుకున్నాను. ఎందుకు ఈ కేక్, కేండిల్స్, బంప్స్ ఇస్తారు అని తెలుసుకున్నాను. ఆర్తీమదేవి(Artimus) అనే దేవతకు ఇష్టమైన పూర్ణ చంద్రుని ఆకారంలో కేక్ చేసి కొస్తారని ఏదో చదివాను. మనల్ని మనం పొగిడించుకోవటానికి పెట్టుకున్న పంచాయతీలే ఇవన్నీ అని అర్ధం అయింది. అసలు పుట్టినరోజు మీద కొంతమంది మేధావులకి వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రపంచం ఈ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తోంది. సోషల్ మీడియా పేరుతో వచ్చిన ఫేసుబుక్ మొదలైన వాటివల్ల మనుషులు జ్ఞాపకశక్తిని కూడా పక్కన పెట్టేసారు. ఎందుకు చెప్తున్నా అంటే గత రెండు సంవత్సరాలు నేను నా పుట్టిన తేదీని ఫేసుబుక్ లో దాచి పెట్టాను. నాకు విషెస్ చెప్పే ఆ పదిశాతం మందిలో ఒక్కడు కూడా చెప్పలేదు. అప్పుడు నాకు అర్ధం అయింది. ఇన్నాళ్లు చెప్పిన ఆ పది మంది కూడా ఫేసుబుక్ వల్లే చెప్పి ఉంటారు అని. ఇప్పుడు ఏం లేదు కానీ ఒకప్పుడు అయితే విషెస్ చెప్పటం, చెప్పించటం లో ఫ్రెండ్స్ ఎంతో కృషి చేసేవాళ్లు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా విషెస్ చెప్పమని నేను SMS చేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇపుడు తెలిసినా కూడా చెప్పట్లేదు. అంతెందుకు నేను కూడా చాలామందికి చెప్పట్లేదు విషెస్. బోర్ కొట్టేసింది, ఇంకా అది పెద్ద విషయం కాదు అని జ్ఞానం వచ్చేసింది అందర్లోనూ.

గత నాలుగేళ్లుగా అంటే వాట్సాప్ లో డైనమిక్ స్టేటస్ లు పెట్టినప్పటి నుంచి ఈ పిల్లలు అందరూ దాన్ని happy birthday అని ఫోటోలు పెట్టడానికి ప్లేట్ఫామ్ గా వాడేసుకుంటున్నారు. అప్పట్లో orkut, hi5 ల్లో పెట్టిన scrap లు గుర్తు వచ్చేవి. ముందు నేను చెప్పినట్టు ఒక ఫ్రెండ్ పుట్టినరోజు వేరే ఫ్రెండ్స్ కి గుర్తు చెయ్యటానికి ఇది బాగా పని చేస్తుంది. కానీ ఇక్కడ చికాకు తెప్పించే విషయం ఒకటి ఉంది. ఒకడు నాకు విషెస్ చెప్తూ స్టేటస్ పెడితే నేను దాన్ని స్క్రీన్షాట్ తీసి నేను మళ్ళీ స్టేటస్ పెట్టేస్కోవాలా? దీని వల్ల నాకేం ఇబ్బంది లేదు కానీ మరీ టూ మచ్ అనిపిస్తుంది నాకు. ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పుకోవటమే ఇబ్బందిగా భావించే నాకు అలాంటి పనులు అంత గిట్టకపోవటాన్ని మీరు తప్పుగా అనుకుంటే అది నా తప్పు కాదు. కొంతమంది అయితే ఇది నా పుట్టినరోజు అని గుర్తు చెయ్యటానికి దేవుడికి thanks చెప్తూ స్టేటస్ పెడతారు. ఇది కూడా పై కోవకే వస్తుంది. నాకు నచ్చలేదు అని చెప్పట్లేదు కానీ అది కూడా డొంకతిరుగుడు వ్యవహారమే అని బల్లగుద్ది చెప్తాను. ఈ రోజు నేను కూడా అలాంటిది ఒకటి try చేశా. అందుకే కాస్త ఎక్కువ మంది నన్ను విష్ చేశారు ఈ సారి. ఇంకో డౌట్ కూడా ఉంది. ఏంటంటే ఒకడు రోజు ఎవరో ఒకరికి విషెస్ చెప్తూ స్టేటస్ లు పెడుతాడు. అసలు నిజంగా వాళ్ళు వీడి ఫ్రెండ్స్ ఏనా, వాళ్ళు అసలు ఈ స్టేటస్ లు చూస్తారా లేక మిగతా వాళ్ళు వీడికి చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది అనుకోవాలనో, లేక నిజంగా ఉంటే అందరికీ తెలియటం కోసం అలా షో చేస్తాడా అని. #justasking.


మా అమ్మ నేను ఏప్రిల్ 25 న పుట్టాను అని నా చిన్నప్పుడు చెప్పింది. కానీ స్కూల్ లో మాత్రం జులై 10 న రాయించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 25 రాత్రి 2 గంటలకి పుట్టాను అని చెప్పింది. అంటే ఏప్రిల్ 26 న చేసుకోవాలా, 25 న చేసుకోవాలా? సాంకేతికంగా 26 నే చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు పుట్టాం అనేది ఎవడికి అవసరం? అందరి పుట్టినరోజులు నిజం అవ్వాలని ఏముంది. వాళ్ళ అమ్మ ఇచ్చిన నమ్మకమే నిజం. అయినా మన పుట్టుక మన చేతిలో లేదు. మన చావు మన రాతలోనే ఉంది. కానీ మన బ్రతుకు మాత్రం మన చేతల్లోనే ఉంది. మన బ్రతుకుని బట్టి దేవుడు, మనం బ్రతికే తీరుని బట్టి ఎదుటివాడు మనల్ని తీర్పు తీరుస్తారు. మా అమ్మ ఇచ్చిన నమ్మకం, ఆమె నమ్మిన నిజం, నమోదు చేసిన అబద్దం మొత్తం మూడు పుట్టినరోజులు ఉన్నాయి నాకు. అవి చాలవు అన్నట్టు ఈ సంవత్సరం మాత్రం నాకు ఏప్రిల్ 23 న, 24 న కూడా విష్ చేసేశారు ఇద్దరు ముగ్గురు నా అత్యుత్సాహపు అభిమాన స్నేహితులు. ఏది ఏమైనా ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకుని నన్ను విష్ చేసే ఆ ఒకరిద్దరికి, ఒకప్పుడు గుర్తు ఉండి, ఇప్పుడు కన్ఫ్యూజ్  అయిన కొంతమందికి, మొత్తం మర్చిపోయిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. ఇది నా బ్లాగ్ నంబర్ 26, ఈ రోజు తేదీ 26, సమయం 2.10 IST  టెక్నీకల్ గా ఇప్పుడే నా పుట్టిన సమయం. 


Happy Birthday to #eckce


-eckce

Saturday, April 24, 2021

Be Careful

B25 dated at Tadepalligudem the 24.04.T21


ప్రతిరోజు రాత్రి ఏదొకటి రాయాలి అనుకోవటం నా ఆశ. కానీ రోజూ అలా రాయలేనటుంది నా ధ్యాస. ఎందుకంటే ఏదో రాయాలి అనిపిస్తే రాయలేను. ఇది రాయాలి అనిపించేలా ఏదైనా జరిగితేనే రాయగల్తాను. ఎందుకంటే నా చేతి రాతని నడిపించేది నా తలరాతే. 


ఇది రాద్దాం, అది రాద్దాం అని కొద్ది కొద్దిగా అర్ధాలు వెతికి వాటి మొద్దు ముద్రలు భద్రంగా పెట్టుకున్నా కానీ వాటికి ఇప్పుడప్పుడే విముక్తి కలిగేలా లేదు. 


ఇప్పుడైతే ఇదే రాద్దాం అని వచ్చాను. ఏదంటే, వెంటనే చేద్దాం అనుకున్న కొన్ని పనులు హా చూద్దాం అనే స్థాయికి చేరి, తర్వాత చేద్దాంలే అనే స్థానంలో ముగుస్తాయి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి నేనైతే వచ్చే సోమవారాన్నో, ఒకటో తారీఖునో ఎంచుకుంటాను. అది సెంటిమెంట్ కాదు గాని నా బలహీనత. ఈ లోగా ముందస్తు కార్యకలాపాలు ఏర్పాట్లు చేస్కోవటానికి బాగుంటుంది అనే సాకుతో కాలయాపన చేస్తాను. తర్వాత అది చెయ్యాలనే ఉత్సాహం తగ్గి అది చెయ్యకపోతే ఏమైద్దిలే అనే నిర్లక్ష్యం పెరిగి ప్రణాళికలు ప్రక్షాళన పాలవుతాయి.



కానీ ఒక కొత్తపని అలవాటు చేసుకోవటానికైనా లేదా ఒక పాత అలవాటుని మానెయ్యటానికైనా రెండు బలమైన సహకార్లు ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఒకటైనా ఉండాలి. ఒకటి ఎలాగైనా చెయ్యాలనే దృఢ సంకల్పం. ఇది అందర్లో ఉండటం కాస్త ఇబ్బందే. అందుకే కాస్త సులువైనది రెండోది ఉంది. అదే మనతో పాటు ఆ పని చేసే మరో సహచారిని వెతుక్కోవటం. ఒకరి సంకల్పం సరిపోనప్పుడు ఇద్దరి సమాన ఆలోచనల్ని సమాంతరంగా సానపడితే ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఆ పని పూర్తి చేసే అవకాశం ఉంది.


అందునే నేను ఒంటరిగా చేసే కంటే జంటను వెతుక్కుని పని చెయ్యాలని చూస్తాను కానీ నాకు జతగా ఉండటానికి ఎవరూ సాహసించరు. కనీసం సహకరించరు. నిజానికి నా తోడు సహించరు. 


అలా ఎన్నో, ఎన్నో శంకుస్థాపనలు కనీసం పునాదిరాళ్లు లేకుండా ఆగిపోయాయి నా జీవితంలో. కొన్నైతే సగం వేసిన పిల్లర్లతోనే మిగిలిపోయాయి. ఈ మాట రాస్తుంటే ఒకటి గుర్తు వచ్చింది. చిన్నప్పుడు మా ఇంటికి కాస్త దూరంలో ఒక ఇల్లు పునాది వేసి పిల్లర్లు లేపి అలాగే వదిలేశారు. అలా చాలా నెలలు ఉండిపోయింది. ఇటుక, ఇసుక, సిమెంట్ కొనుక్కోవటానికి డబ్బులు లేకపోతే అలా కొన్నాళ్ళు కట్టుబడి ఆగిపోవటం పల్లెటూళ్ళలో మాములే కదా. ఎన్ని ఏళ్ళైనా ఆ సగం పిల్లర్లు అలాగే మిగిలిపోయాయి. దానికి కారణం కనుక్కున్న నేను షాక్ తిన్నాను అనటం చిన్నమాట అవుతుంది. సరిగ్గా ఆ ఇంటి మీద నుంచి కరెంట్ సర్వీస్ వైర్లు వెళ్ళటం వల్ల అది పూర్తి చేయొద్దని చెప్పారంట. అందుకే అది సగం కట్టిన బిల్డింగ్ లాగే మిగిలిపోయింది. ఇక్కడ మీ మరియు అప్పటి నా ప్రశ్న: *ముందు చూస్కోలేదా?*


కనీస ముందు జాగ్రత్త లేకుండా పనులు మొదలు పెడితే వచ్చే ఆర్థిక, కాల నష్టాల గురించి చెప్పటమే ఈ గతపు కథని చెప్పటానికి కారణం.


మనిషి విఫలం అవటానికి సగం కారణం కనీస సొంత ప్రణాళిక లేకపోవటం. మిగతా సగంలో సగం కారణం వేసిన ప్రణాళికను అమలు పరచలేకపోవటం. జీవితంలో చాలా మెట్లు, ఎత్తులు అవరోహిస్తాం. నిన్నటి సమస్య రేపు కూడా ఉంటుంది అనుకోకూడదు. కానీ నిన్నటి సమస్యకి ఈ రోజే పరిష్కారం చూపించాలి అంటే proper planning చాలా ముఖ్యం. ఒకోసారి మన ప్రమేయం లేకుండానే మన ప్రణాళికలు మన వాళ్ళ అమాయకత్వం వలనో బయటవాళ్ళ టక్కరితనం వలనో పటాపంచలవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే మరి. జాగ్రత్త అనే మాటకి స్వచ్ఛమైన అర్ధం తెలుసుకునే రోజుల్లో ఉన్నాం. అందుకే చెప్తున్నాను. జాగ్రత్త.



-eckce

Friday, April 16, 2021

Weakness

B24 dated at Tadepalligudem the 16.04.T21


చిన్న చిన్న పిల్లలు చక్రాలు సాధిస్తున్నారు, నువ్వేమో బయటకెళ్లి ఆ అంటే ఊ అనలేవు అని చిన్నప్పుడు మా అమ్మ తిట్టేది. ఆ మాటలో ఎంతో అర్ధం ఉంది. ప్రతి అమ్మ చిన్నప్పుడు పిల్లల్ని అలా అని ఉండొచ్చు కానీ ప్రతి పిల్ల లేదా పిల్లవాడు పెద్దయ్యాక కూడా అలాగే ఉండరు. నేను మాత్రం మా అమ్మతో ఇప్పటికీ అలా తిట్టించుకోవటానికి అర్హుడినే. మా అమ్మ ఇప్పుడు అలా తిట్టట్లేదు అంటే అది ఆమె సంస్కారం. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను బయట ఏదైనా పని చేయాలి అంటే ఎవరితో అయినా తోడుగా వెళ్లి లేదా ఎవరిని అయినా తోడు తీసుకెళ్లి వాళ్ళ చాటున ఉంటూ పని ముగించుకునే చేతకాని వాడిని నేను.

ఎంత చేతకాని వాడిని అంటే మా అమ్మ స్థానంలో నా పిల్లల అమ్మతో తిట్లు తినే స్థాయికి వచ్చిన వాడిని. కానీ నాకు అర్దం కానిది, ఇప్పుడే తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే  కొంతమంది తెలివైన వారికి అలుసుగా ఏర్పడిన నా బలహీనతగా ఇది మారటం.

ఎక్కువ మాట్లాడకపోవటం నా బలం అనుకుంటాను నేను. దానివల్ల గొడవలు తక్కువ అవుతాయని భావించి వీలైనంత తక్కువ మాట్లాడుతూ చేతనైనంత ఎక్కువ పని చేస్తూ ఉండాలి అనుకుంటాను. కానీ నా మౌనానికి వారి గొంతుని జత చేసి నా భయాన్ని వారి బలంగా మార్చుకుని నా పక్కన ఉండాల్సిన వారు నన్ను పక్కన పెట్టేస్తే నేను బలంగా అనుకునే నా బలహీనతను నిందించాలా? లేక నాకు చేతకాని గాంభీర్యాన్ని నటించాలా?. మూడో తరగతి పిల్లాడికి ఉండాల్సిన అలవాట్లే ఇంకా నా రోజులో భాగాలుగా ఉంటే ఇంకా మా అమ్మ నన్ను అలా అని ఉండటంలో ఆశ్చర్యం లేదు.

ఒకడు పెద్దవాడు అనిపించుకోవాలి అంటే వయసు పెరిగితే సరిపోదు, చిన్నతనపు అలవాట్లని విడిపించుకోవాలి. ఒకడు గొప్పవాడు అనిపించుకోవాలి అంటే  గొప్పగా ఆలోచిస్తే సరిపోదు, గొప్పలకి పోకుండా ఉండటం నేర్చుకోవాలి.

నన్ను ఎవరూ చెడ్డవారు అని అనుకునే అవకాశం నేను ఎవరికి ఇవ్వను కానీ వారి అజ్ఞానం అలా నడిపిస్తే నేనేం చేయలేను. కానీ నన్ను మంచివాడు అంటూనే ముంచే వాళ్ళ నుంచే తప్పించుకోలేకపోతున్నాను. ఎవరిని ఏమీ అనలేని నా బలహీనత ఏమీ అనడులే అనే వారి ధైర్యం ద్వారా ఏమైనా చేయొచ్చులే అనే వారి ఆలోచన ఏమి చెయ్యలేని నా స్థాయిని సూచిస్తుంది.

నా బలహీనతని అలుసుగా తీసుకున్న వాళ్ళని హెచ్చరించలేను, నన్ను బాధ పెట్టినవారిని శపించలేను. అలాగని ఊరికే అన్నిటిని సహించలేను. ఎందుకంటే నా ఖర్మ ఫలానికి ఎవరిని బాధ్యుల్ని చెయ్యను. మా అమ్మ మొదట్లో చెప్పిందే నిజం అయింది, ఎవరెవరు ఏమేమి చక్రాలు సాధిస్తున్నారో చూసి కనీసం వారికి నేను గుర్తు లేనే అని ముందు బాధపడి, తర్వాత వారి విషయమై ఆనందపడి కన్నీరుని పన్నీరుగా మార్చుకోవటమే నా వంతు అయ్యింది.

-eckce

Sunday, April 11, 2021

నిన్నటి తప్పు

B23 dated at Tadepalligudem the 11.04.T21


అందరూ తప్పులు చేస్తారు. కొందరు ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తారు. దాన్ని వారి బలహీనత లేదా లోపం గా చెప్పొచ్చు. కొందరు మళ్ళీ మళ్ళీ  వేర్వేరు తప్పులు చేస్తారు. వీరి తప్పులు మారతాయి కానీ వారి ఆలోచన మారదు. కొందరు అయితే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇపుడు మన టాపిక్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుని తెలియక పొరపాట్లు చేసేవారి గురించి. కాదు కాదు కరెక్ట్ అనుకుని తెలియక చేసే పొరపాట్ల గురించి. పోనీ వాళ్ళు ఎదో తెలియక చేశారు, కానీ అవి తప్పులు అని తెలిసేది ఎప్పుడు? జరిగింది రివ్యూ చేసుకున్నప్పుడో లేక ఎవరైనా నువు చేసింది తప్పు అని చెప్పినప్పుడే కదా. నా మట్టుకు నాకు మళ్ళీ చదివితే నేను నిన్న రాసిన బ్లాగ్ లో కూడా తప్పులు కనిపిస్తాయి. మనం చేసే టైమ్ కి ఎంత వెతికినా కనిపించని ఆ తప్పులు కొంత కాలం తర్వాత భలే దొరుకుతాయ్. దీన్నే కాలం చేసే చమత్కారం అనొచ్చు.

బహుశా మనం తప్పు చేయట్లేదు అనే భావనే మన తప్పుల్ని కనిపెట్టే వివేకాన్ని వాటి పనిపట్టే జ్ఞానాన్ని కనికట్టు చేస్తాయేమో. విషయం విపరీత స్థాయికి చేరినప్పుడే ఇంద్రియాలు మందు తాగినట్టు ప్రవర్తిస్తాయంట. అలాంటపుడు మనం చేసేవి, మాట్లాడేవి మన అదుపులో ఉండవు. కానీ తర్వాత మాత్రం గుర్తు చేసుకుంటే భలే సిగ్గేస్తుంది. 


ఉదాహరణకు నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక notebook లో డైరీ రాసేవాడిని. అది కూడా ఇంగ్లీష్ లో. వేరే వాళ్ళకి అర్ధం కాకూడదని అలా రాసానో లేక నాకు ఇంగ్లీష్ వచ్చు అని అనుకున్నానో ఏమో కానీ ఇప్పుడు చదివితే అది నాకు కూడా అర్ధం కాదు. నాకున్న జ్ఞాపకశక్తి వల్ల వాటికర్ధం తెలుస్తుంది కానీ అసలు అర్థమే లేని రాతలు అవి. కొన్ని రోజుల తర్వాత ఇవి కూడా అలాగే అనిపించొచ్చేమో.


మనం చేసేవి, చూసేవి, రాసేవి ఆ టైమ్ కి బాగుంటే చాలు అనుకునే వాళ్ళు కొందరు అయితే అవి ఎప్పటికీ బాగా ఉండాలి అని ఆచితూచి నడుచుకునే వారు కొందరు.


ఇంతకీ మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా ఆ తప్పుని వేలెత్తి చూపిస్తే మనకి ఎలా ఉంటుంది? అందరికి కాలుతుంది. కానీ కొందరే తప్పుని ఒప్పుకుంటారు. కొందరు పెద్ద తప్పేం కాదంటారు. కొందరు తప్పే అయితే ఏంటి నేను ఒక్కడినే చేశానా ఇలా అని వాదిస్తారు. కొందరు నువ్ ఎవడివి చెప్పటానికి అంటారు. కొందరు మాత్రం చాలా డిప్లొమేటిక్ గా నువ్ మాత్రమే నాలో తప్పులు వెతికి చూపిస్తావ్ అంటారు. మనల్ని పొగిడారో తిట్టారో తెలియని సందర్భం అది. నేను మాత్రం ఈ అన్ని రకాల రియాక్షన్స్ ని చూసాను.


చాలా తక్కువ మంది మనం తప్పుల్ని చెప్పినప్పుడు thanks for correction అంటారు. అలా అన్న వాళ్ళ inner feeling మనం చూడలేము కానీ వాళ్లలో కొంతమంది మనం వాళ్ళ గురించి మంచిగా అనుకోవాలనే అలా చెప్తారు తప్ప లోలోపల తిట్టుకునే బ్యాచ్ అది. మనం ఎప్పుడు తప్పు చేస్తామా వెతికి పట్టుకుందాం అని  కనిపెట్టుకుని ఉంటారు. అది ఒకందుకు మంచిదేలే మనం కూడా అప్రమత్తంగా ఉండొచ్చు.


ఏది ఏమైనా ఎప్పుడు కుదిరితే అప్పుడు గతంలో మనం ఏమైనా తప్పులు చేశామా దాని వల్ల ఎవరైనా అవస్థలపాలయ్యారా అనేది ఆలోచించటం మన కనీస బాధ్యత అనేది నా ఆలోచన. ఎందుకంటే మనం తెలిసీ తెలియకుండా చేసిన తప్పుల వల్ల వేరే వాళ్ళకి మనం శతృవుగా మారితే దాని వల్ల మనకే నష్టం. ఒకరి దగ్గర మంచివాడిగా అనిపించుకోవటం అంత సులువు కాదు కదా. నా ముందు ముఖస్తుతి చేసేవాడిని, నా వెనక నా తప్పుల్ని, బలహీనతల్ని హేళన చేసేవాడిని నేను ఎప్పటికి నమ్మను. 



కాబట్టి మన ప్రవర్తనని జడ్జ్ చేసే అవకాశం అవతలివాడికి ఇచ్చినప్పుడే మన లోపాలు మనకి తెలుస్తాయి. అదే అవకాశం మనకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మంచికోసం ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కానీ వారు నొచ్చుకునేలా కాదు. ఊరికే హర్ట్ అయిపోవడం లాంటి చిన్న తరహా చేష్టలు తగ్గించి హుందాగా ప్రవర్తిస్తేనే అందరికి మంచిది. 



ఈ పోస్ట్ జనహితార్ధం జారీ చేయటమైనది.


eckce

Thursday, April 1, 2021

Happy New Year

B22 dated at Tadepalligudem the 01.04.T21


ఏప్రిల్ నెల అంటే ఎందుకో కాస్త పక్షపాతం నాకు. ఒక వింత వాతావరణాన్ని మనకి (నాకు) కొత్తగా పరిచయం చేస్తుంది. కొత్త ఎండలు మొదలయ్యే ముందు పూతలు రాలే ఆ పళ్ళ చెట్ల నుండి వచ్చే వాసనతో కూడిన నునువెచ్చని గాలితో ప్రతి ఏడాది నూతనానుభూతిలో నా మనసు ఏదో మొదటిసారి అలా అనుభవిస్తున్న భావాలతో గత పాతికేళ్లుగా నిండుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 


నేను ఎంత చెప్పాలి అనుకున్నా ఇంకా నేను చెప్పాలి అనుకుని చెప్పలేకపోతూ ఉన్నది ఏదైనా ఉంది అంటే అది ఈ ఏప్రిల్ నెలలో వచ్చే ఆ వాతావరణ మార్పుల వల్ల నాకు కలిగే ఆ సంభ్రమాశ్చర్యమే. అసలు నాకే ఇలా అనిపిస్తుందా అనే సందేహం కూడా నాకు ఉండేది కానీ అది నిజమేం కాదని తెలిసింది. ఎందుకంటే వసంతఋతువులో ఉన్న ప్రత్యేకతే అదంట. మార్చి మధ్యస్థంలో మొదలవ్వాల్సిన ఆ ఋతువు లక్షణాలు ఏప్రిల్ లో పరిపక్వత పొంది దాని రుచుల్ని మనకి అందిస్తాయి.


చీకటిపై ఆధిపత్యం చేలాయించే పగటి వెలుగులు, ఇలా ఉండాలిరా అనిపించే ఉష్ణోగ్రతలు, చిట్టిపిల్లల్ని ఈనే జంతువులు, రాలే పూతలు, పూసే పువ్వులు, కాసే కాయలు, వాటితో వచ్చే ఘుమఘుమలు, ఎల్లప్పుడూ సముద్రం దగ్గర ఉన్నామా అనిపించే తాజా సాయంత్రపు చల్లటి గాలులు (నన్ను ఉర్రూతలు ఊగించింది ఇదే). ఇవే కదా ఏప్రిల్ నెలకు అలంకారాలు.


ఏప్రిల్ ఒకటి రాగానే ఫూల్ చెయ్యాలని కొందరు, ఫూల్ అవ్వకూడదని కొందరు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడేవారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవిలో వెళ్ళినప్పుడు పక్కింటి పాప వాళ్ల అమ్మని ఏప్రిల్ ఫూల్ చేసింది. అప్పుడు వాళ్ల అమ్మ ఇది ఏప్రిల్ ఫూల్ నెల కాదు మే నెలమ్మా అని చెప్పగానే ఆ పాప మళ్ళీ ఫూల్ చేసి మే నెల అని చెప్పి బాగా నవ్వుకుని ఆనందించింది. She is obsessed with fooling in this period. Elementary school లో చదివే రోజుల్లో మా teacher ను fool చేసి ఏప్రిల్ fool అన్నారు ఎవరో. దానికి hurt అయిన ఆయన పెద్ద వాళ్ళని అలా చేసేటప్పుడు fool అనకూడదు ఏప్రిల్ first అనాలి అని cover చేసుకున్నారు. ఆయన పేరు శివయ్య కానీ సీతయ్య character ఆయనది.


కొంచెం పెద్దయ్యాక అయితే ఏప్రిల్ నెల మొత్తం చదువుల నెలే. ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ రాకపోతే నేరం అప్పట్లో. ఇంకా పెద్దయ్యాక ఈ ఏప్రిల్ నెలలోని కొత్త వాతావరణమే గుర్తు చేసేది అసలు నాకు వయసు వచ్చింది అని. ఇంకా పెద్దయ్యాక ఈ ఏప్రిల్ నెలే నాకు గుర్తు చేస్తుంది నా వయసు పెరుగుతుంది అని. ఎందుకంటే నేను పుట్టింది ఈ నెలలోనే అని తెలిసింది. నేనే కాదు మా అక్క కూడా పుట్టింది. మేమే కాదు నాకు మున్ముందు దగ్గరైన కొంతమంది కూడా ఇదే నెలలో పుట్టడం కూడా మరో వింత. ఇవన్నీ సరిపోక ఇదే నెలలో పుట్టిన అమ్మాయితో ఇదే నెలలో తీరని తిప్పలు తెచ్చి పెట్టే తీవ్ర తీర్మానం జరిగింది. అది నేను చూసిన, చేసిన ఘోరాల్లో అతి పెద్దది. అయినా నేను ఇలా  బాగానే ఉన్నానంటే దానికి కారణం ఏప్రిల్ లో వచ్చే ఈ కొత్త వాతావరణమే.


ఇప్పుడైతే ఏప్రిల్ వచ్చింది అంటే మార్చ్ వెళ్ళిపోయింది అనే ఆనందం కూడా దీనికి తోడవుతుంది. మనవాళ్ళు కూడా ఇప్పుడే యుగానికి ఆది అని ఒక రోజు సెలవు తీసుకుంటారు కదా. ఈ ఋతువులోని లక్షణాలే వారికి ఆ ప్రేరేపణ ఇచ్చి ఉంటాయేమో అని ఇప్పుడు సరదాగా అనిపిస్తుంది. 


వారు అన్నారని కాదు గాని నా దృష్టిలో ఇదే నూతన సంవత్సరం. Yes I am Obsessed with this Season which falls in April. 


Happy New Year.

Wednesday, March 31, 2021

ఎవరి మాట వినాలి?

B21 dated at Tadepalligudem the 31.03.T21


నా జీవితంలో నేను ఇప్పుడు ఒకరిని శాసించే స్థానంలో లేకపోయినా వంద మందికి చెప్పే స్థాయిలో అయితే ఉన్నాను. దానికి కారణం నేను నడిచిన దారులు అందులో నేను ఎదుర్కున్న దారుణాలు. ఎన్నో ప్రతికూల పరిస్తుతులతో ఒంటరిగా పోరాడాను.  శారీరక, సాన్నిహిత్య, సంసార సమస్యలు సంకట సంఘటనలై సంఘర్షణ చేస్తుంటే  అసంతృప్తి సాగరాన్ని రహస్య సైనికుడినై ఎదురీదాను. నా అనుభవాలే నా అర్హతలు.


ఎవరి జీవితాన్ని వారు మలుచుకునే సమయం, అవకాశం ఈ సమాజం ఎప్పుడూ ఇవ్వదు. సరిగా ఆలోచించే జ్ఞానం అలవర్చుకునే అనుభవం వచ్చేలోపే జీవితంలోని కీలక నిర్ణయాలు అప్పుడే తీసుకోమంటుంది. దానికోసం అప్పటికే అనుభవం పొందిన వారితోపాటు మార్గదర్శి లో చేరమంటుంది. వాడు బాగు పడితే అనుకోవచ్చు కానీ వాడు కూడా మనలో ఒకడే. కాకపోతే కాస్త ముందుగా చెడిపోయి ఉంటాడు అంతే. 

మున్ముందు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని ఎంతో మంది ఇలా ఇతరుల మార్గంలో నడిచి మడమ ఇమడక నడుం సహకరించక మధ్యలో ఆపలేక జీవిత చట్రంలో జన్మఖైదీలుగా మిగిలిపోయారు. దాన్నే రాత అని సరిపెట్టుకుని వారి విషయంలో ఇతరులు చేసిన తప్పుని వారి పిల్లల విషయంలో మళ్ళీ చేసేస్తున్నారు. ఇదోరకం జీవన చక్రం.


అనుభవజ్ఞులైన ఎంతో మంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్తే వినాలి అని. ముందుగా చవి చూసిన వాళ్ళ అనుభవాన్ని మనం అలవర్చుకోగలమా? ఒకరి అనుభవం మనకి అదే అనుభూతిని ఇస్తుందా? ఒకడు పెళ్లి చేసుకుని అందరూ తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. మరొకడు జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఇదే, నువ్వు మాత్రం చెయ్యకు అంటాడు. పెళ్లి అని కాదు గాని అన్ని విషయాల్లోనూ ఇలాంటి అనుభవజ్ఞుల్లో ఒకడు అన్ని భోగాలు అనుభవిస్తాడు కానీ నువ్ ఈ రొచ్చులోకి దిగకు నేను నరకం చూస్తున్నాను అంటాడు. ఇంకొకడు అయితే వాడిలా ఇంకొకడు సుఖపడకూడదు అని చచ్చు సలహాలిచ్చి నాశనం చేస్తాడు. పాపం ఒకొకడు నిజంగానే మంచి సలహా ఇస్తాడు గాని మనకే నమ్మబుద్ధి కాదు. వీళ్లని గుర్తు పెట్టుకోండి. తర్వాత వాడదాం.



అసలు ఎవరి మాట వినాలి? ఏదైనా చేసే ముందు అందరూ ఇచ్చే సలహాలు విని ఎవరిని అనుకరించాలి? ఎవరిని అనుసరించాలి? 

ఎవరిది పట్టించుకోవాలి? ఎవరిది పక్కన పెట్టాలి? 


సొంత నిర్ణయంతో ముందుకు వెళ్తే ఆశించని ఫలితాలకు స్వీయ సంజాయిషీ ఇచ్చుకోవాలి. పోనీ ఇరుగు పొరుగు అనుభవాలపై మోజు పడి అనుకరణ చేసినా దెబ్బ తగిలితే మనమే మందు పూసుకోవాలి. ఎలా అయినా వృధా చేసిన మన కాలం, శ్రమ అనుభవ రూపాన్నీ దాలుస్తాయిలే.  ఏమి చేసినా ఎలా చేసినా అది సరిగా చేశామా అన్న దాని మీదనే ఫలితం ఆధారపడినప్పటికీ అసలు అది చెయ్యాలా వద్దా అనేదే ఇక్కడ మూల ప్రశ్న. ఎందుకంటే వడ్లు చూడాలి అనుకున్నప్పుడు వరి పంటనే వెయ్యాలి కానీ జొన్నపంట కాదు. చేయబోయే పని నచ్చదు అనుకుంటే నచ్చే పని చెయ్యాలి అనుకోవాలి కానీ చేసేకొద్ది నచ్చుతుందేమో అని భ్రమలో బ్రతకటానికి సిద్ధం అవ్వకూడదు. సిద్ధం అయ్యావ్ అంటే అది భ్రమ కాదు నిజం అని నమ్మటం అలవాటు చేసుకుంటూ స్వీయ మోసం ఆత్మద్రోహం చేసుకోవాలి.



మరి ఎలా? ఎలా? 

ఇంకా అంత ఆలోచించలేదు. ఏమైనా వచ్చాక మళ్ళీ వస్తా.


-eckce.

Thursday, March 4, 2021

Missing Lockdown

B020 dated at Tadepalligudem the 04.03.T21


గతేడాది ఫిబ్రవరిలో ఒక కస్టమర్ సర్జికల్ మాస్క్ లో రావటం చూసి ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు అని ఆఫీస్ లో కొలీగ్స్ తో జోకులేసుకున్నాను. ఆ కస్టమర్ ని అడిగేసా కూడా అంత అవసరమా అని. ఎందుకైనా మంచిది కదా అని అన్నాడు. అలాంటిది ఈ రోజుకి కూడా మాస్క్ వేసుకునే బయటకి వెళ్లడం అలవాటుగా మారింది అందరికీ.

మార్చ్ 4కి సరిగ్గా సంవత్సరం పూర్తి అయింది, AP తెలంగాణ మొత్తం వణికిన రోజు ఇది. మన పక్కకి కూడా రాదు అనుకున్నది మన పక్క వరకు వచ్చేసింది అనగానే అందరూ భయంతో మాట్లాడుకున్న రోజు అది. నేను exam రాయటానికి ఊరెళ్తే వాట్సాప్ గ్రూప్ లో డిస్కషన్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ లోకి వచ్చింది అని emlpoyees ని ఇంటికి పంపేశారు అని. మధ్యాహ్నానికి కాకినాడ హాస్పిటల్ లో ఒక ఫారిన్ రిటర్న్ కి వచ్చింది అని టీవీ లో ఫ్లాష్ న్యూస్ కూడా రావటం చూసా. ఇదిలా ఉంటే ఇంకా కొన్ని అసత్య వార్తలు కూడా వ్యాపించాయి. కానీ అప్పటికి అవి నమ్మేసామందరం. కానీ అక్కడ ఇన్ని ఇక్కడ ఇన్ని అంట అని చెప్పుకోవడం తో మొదలైన హడావిడి న్యూస్ ఛానెళ్ళకి మంచి ఐటెమ్ గా మారింది. మెల్లగా దేశం మేల్కోవటం, ఆరిందాలు ఆక్షేపించటం, నెటిజన్లు జోకులు వేయటం, ఆయుర్వేద ఆరోగ్య వేత్తలు ఆసరాగా తీసుకుని జాగ్రత్తలు చెప్పటం, జ్యోతిష్యులు జాతకాలు బాలేదని చెప్పటం, మతస్తులు చరిత్ర ముందే చెప్పిందని కల్పనలు చెయ్యటం, ఇలా ఎక్కువ మోతాదులో అబద్దాలు చక్కర్లు కొడుతున్న సమయంలో దేశమంతా కలిసి పోరాడితేనే గాని ఈ చేదు నుంచి తేనెను పొందలేమని పెద్దల సమక్షంలో దేశ పెద్ద నిర్ణయించట దాన్ని అందరూ మెచ్చుకోవటం, దానికి మద్ధతివ్వటం అదే రోజు అధిక సంఖ్యలో బాధితులు బయట పడటం అన్ని 20 రోజుల్లో జరిగిపోయాయి. 


పద్నాలుగు గంటలు దేశం మొత్తం మూసుకుని ఇంట్లో కూర్చున్న రోజును అందరు పండగ లా చేసుకున్నారు. గడువు పూర్తి కాగానే జైలు నుంచి విడుదల అయినట్టు కొందరు సంబరాలు జరుపుకున్నారు. కానీ కేవలం ఒక్కరోజుకే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఏడో ఎక్కం చదివినట్టు 14 రోజులు, 21 రోజులు అంటూ గృహ నిర్బంధ చట్టానికి చుట్టాలయ్యాం. మంచి అయినా చెడు అయినా పంచటానికి అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా వల్ల చాలామంది జగురూకత రీత్యా లాభపడ్డారనే చెప్తాను. అయితే భయభ్రాంతులకు గురి చేసిన ఘనత కూడా దానికే ఉందిలే. కానీ చాలా ఎక్కువ విషయాల్ని ప్రజలకి తెలియచేసిన రోజులవి. నాకు shut up తెలుసు shut down తెలుసు, lock up తెలుసు. ఇవన్నీ కలిపిన పదం వేరే అప్పుడే విన్నాను. ఇది కాలం నేర్పిన పదం. 2004 లో tsunami అనే పదాన్ని నేర్చుకున్న జనం పదిహేనేళ్ల తర్వాత lockdown, quarantine లాంటి ఎన్నో పదాల్ని అలవాటు కూడా చేసుకుని వాడేస్తున్నారు. ఎంతో మందికి నష్టం, కొంత మందికి లాభం, అందరికి భయం, స్తంభించినవి కొన్ని, ఆగిపోయినవి కొన్ని, మెచ్చుకోవాల్సిన వాళ్ళు ఎందరో ఇలా 14, 21,15 రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత ప్రమాదంగానే మారింది గాని ఫలితం మాత్రం కనిపించలేదు. కొవ్వొత్తుల వెలుగులు, చప్పట్ల బెదిరింపులు, తపేలాల చప్పుళ్ళు తమాషాకి చేసినట్టే ఉన్నాయి సమాధానం ఇవ్వలేదు. ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఈ దుస్థితి ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడగా, అన్నీ ఉన్నవాళ్లు ఇదే బాగుంది కొనసాగాలి అని కోరుకున్నారు, ఈ సమయంలో వాళ్ళు ఇలా చెయ్యాలి, వీళ్ళు ఇలా చెయ్యాలి అని కొందరు విమర్శించటం చేస్తుండగా ఎంతో సృజనాత్మకతను బయటకి చూపించే అవకాశం, అది చూసే సమయం జనాలని దక్కింది. దుయ్యబట్టే లక్షణం ఉన్న వాళ్ళకి కుడా మంచి సందర్భాలే వరించాయి. 2016 నవంబర్ లో రెండు వారాలు, ఇప్పుడు 24 వారాలు. కొందరు వారి ఉదారత్వాన్ని బయటకి చూపిస్తే కొందరు వారికి ఉన్నది వాళ్ళు చూపించి ప్రజల్ని అలరించటానికి ప్రయత్నించారు. ప్రభుత్వం మాత్రం యువతని కట్టడి చేసే ప్రయత్నాలు మెల్లగా ముమ్మరం చేసి వారికి వ్యసనాలుగా భావిస్తూ కొన్నిటిని  తక్షణ రక్షణ కోసం బహిష్కరించింది. సమయం సరదాగా నడుస్తుంది అనుకున్న వాళ్ళకి సరదా తీర్చింది. మనతో తిరిగిన వాళ్ళని కూడా కాలం బలి తీసుకున్న రోజుల్ని దాటుకొని ఈ రోజుకి ఇలా ఉన్నాం. నేను కూడా భయపడిన సందర్భాలు రెండు ఉన్నాయి కానీ నేను నా ఇంట్లో ఎవరూ దీని బారిన పడకుండా, కనీసం పరీక్ష వరకు కూడా పోకుండా దేవుడు రక్షించాడు. కానీ కోల్పోయిన కొన్ని జీవితాలకు మనం అందరూ సాక్షులం. ప్రమాదాన్ని దాటుకుని వచ్చిన ఎందరితోనో ఇప్పుడు మనం కలిసే ఉంటున్నాం. చాప కింద నీరులా అనుకూల పరిస్థితులు మన అదుపులోకి వచ్చాయి. మొదటి ఆరునెలలు వణికించి తర్వాత ఆరునెలలు unlock అంటూ ఎలా జరిగిపోయింది అనేది మిస్టరీ. కానీ మళ్ళీ మాస్క్ లకి గిరాకీ పెరిగే పరిస్థితులు రాకుండా ఈ ఏడాది అనుభవాల్ని జాగ్రత్తలుగా పాటించాలి. 



ఎన్నో మంచి అనుభవాలు మిగిలిపోయాయి. నా జీవితంలో గడిచిన అతి వింత సమయం ఈ 12 నెలలు. చేదైనా బాధైనా ఇదే నిజం. కొందరికి సానుకూలంగా కొందరికి ప్రతికూలంగా గడిచిన ఈ మహమ్మారి మాయాజాల కాలం మళ్ళీ తిరిగిరాదు. నిజానికి రాకూడదు.


-ఎక్స్.

Thursday, February 25, 2021

Misstep

B019 dated at Tadepalligudem the 25.02.T21


Once you commit a mistake, it misses all your takes further. తప్పనిసరి పరిస్థితుల్లోనో పంతం పట్టుదలతోనో ఒక్కసారి తప్పు చేస్తే దాని ఫలితం చాలాకాలం వెంటాడుతుంది. ఇంత అనుభవించాక ఇప్పుడు అనిపిస్తుంది ఆచితూచి అడుగేయ్యాలి అని. అయినా పడాల్సిన కష్టం జరగాల్సిన నష్టం ఇంచాల్సిన అనుభవం అన్ని సంభవించేసాయి. కానీ అలా చేసినందుకు నన్ను ప్రేరేపించిన నా బలహీనతలే నన్నింకా పట్టి పీడిస్తున్నాయి.

ఎందుకంటే అవి ఇంకా నా ప్రధాన బలహీనతలు గానే ఉన్నాయి. దాని పర్యవసానం ప్రతిరోజూ అనుభవించటమే కాకుండా భవిష్యత్తుకి కూడా కొనసాగిస్తున్నా. అందుకే ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని కొనసాగించాలి మరియు ఫలితం అనుభవిస్తూనే ఉండాలి.

ఒకటి అసలు ఎలాంటి తప్పటడుగు వేయకూడదు రెండు వేసినా పశ్చాత్తాప పడకూడదు. ఎందుకంటే అడుగు వేశాక వెనక్కి తీసుకోలేము.

నేను రాసేవి అన్ని తప్పుల్లా మీకు అనిపించవచ్చు. కానీ నేను అంటాను నేను చేసేవే తప్పులని. నేను generalise చేసి చెప్పట్లేదు కానీ general గా చెప్తున్నా.

తెంచుకోలేని ఉచ్చులో చిక్కినప్పుడు బంధించబడ్డాం అని తెలిసేలోగా సంధించినవాడెవడో ఆలోచించకుండా చిక్కుల్లో చక్కగా చలామణి అవ్వటం నేర్చుకోవాలా? దీనికి సమాధానమే నా జీవితం.


-ఎక్స్

Sunday, February 21, 2021

Coward-Awkward

B018 dated at Tadepalligudem the 21.02.T21


All my life I used to be a freaking coward. 


నేను బ్రతికిన రోజులన్నీ భయపడుతూనే ఉన్నాను. కొన్నిసార్లు నేను తప్పు చెయ్యటానికి భయపడను కానీ చేసిన తర్వాత భయపడతాను. అవసరం లేని చోట, అవసరం లేని వాళ్ళకి కూడా భయపడతాను. ఏమైనా జరిగితే భయపడతాను. ఏదైనా జరుగుతుందేమో అని భయపడతాను.


ఎవరైనా ఏమైనా అంటే భయపడతాను, ఏదైనా అంటారేమో అని భయపడతాను. ఏదైనా చెప్పటానికి భయపడతాను. ఏమైనా చెప్పాక భయపడతాను. అన్నిటికంటే ముఖ్యముగా ఎవర్నైనా ఏదైనా అనాలంటే భయం, అడగాలంటే భయం. ఒక పిరికివాడిని నేను.


దేవుడు నన్ను ఒక భయస్తుడిగా చేశాడా లేక నేనే ఒక పిరికివాడిలా పెరిగానా? నా మొదటి భయం మా నాన్న. ఏదైనా తప్పు చేస్తే నన్ను మా చెల్లిని గోడ కుర్చీ వేయమన్నప్పుడు నేను ఒక కుర్చీని గోడకి ఆనించి పెడితే ఎలా ఉంటుందో అలాగే కూర్చునే వాడిని. మా చెల్లి మాత్రం గోడకి ఆనుకుని ఒక కాలు లేపి మోకాలు దగ్గర పెట్టి నిలబడి రిలాక్స్ అయ్యేది. నాకు భయం. ఏం చేస్తారనో తెలియదు,  కనీసం ఆలోచన కూడా లేదు. నాన్న అంటే భయం అంతే. ఇందాక అన్నాను కదా ఏదైనా తప్పు చేస్తే అని. అదేంటి అంటే ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లటమే. నాకు గుర్తున్న నా చిన్నతనం అంతా నేను మళ్ళీ మళ్ళీ చేసిన తప్పు ఇది ఒక్కటే. రోజూ ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లిపోవడమే. బయటకి అంటే బలాదూర్ తిరగటానికి అనుకునేరు. మేము ఇల్లు మారాము. కానీ మా పాత ఇంటి దగ్గర ఉండే వాతావరణం అలవాటు  అయ్యి అక్కడికే వెళ్ళాలి అనిపించేది. చెప్తే వెళ్ళనివ్వరు అనో లేక వెళ్ళినపుడు తిట్టారనో గర్తు లేదు కానీ ఎప్పుడూ చెప్పకుండా ఇంటి వెనక నుంచి జారుకోవటమే జరిగేది. ఇంటికి వచ్చాక వాళ్ళని మళ్ళీ ఎదుర్కోవాలంటే భయం. అయినా రోజు అలాగే చేసేవాడిని. ఒక రోజు అలా ఇంటి వెనక నుంచి గోడ దూకి వెళ్తూ వెనక నుంచి ఎవరైనా చూస్తున్నారేమో అని వెనక చూస్తూ ముందుకు పరిగెడుతూ స్తంభాన్ని గుద్దుకున్నా. నొసలు మీద రక్తంతో ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కే వచ్చా.


ఇలా ఈ భయానికి తోడు నాకున్న మరో మా చెడ్డ అలవాటు మొహమాటం. ఎవరితోనూ కలవలేకపోవటం. ఇప్పటికీ నేను ఎవరికి తెలియకుండా కవర్ చెస్తున్న అలవాటిది. కానీ చాలామందికి దొరికిపోతాను. ముఖ్యంగా బంధువుల దగ్గర. ఆ అనుభవాలు చెప్పుకోకపోతేనే మంచిది. Miserable. ఇప్పటికి కూడా చాలామంది బంధువులు, ఊళ్ళో వాళ్ళు ఫోన్ అయినా చెయ్యవేంటి అంటారు. నా దగ్గర సమాధానం లేని ప్రశ్న ఇది. ఒకవేళ ఎవరైనా నాకు ఫోన్ చేసినా నా వైపు నుంచి ఊ కొట్టడమే తప్ప అడిగి చెప్పటం ఏం ఉండవు. అందుకేనేమో నేను ఫోన్ చెయ్యను ఎవరికి. వాళ్ళు అడిగిన తర్వాత చేస్తే అడిగాం అని చేసాడు అనుకుంటారేమో అని భయం. అలా అనుకోకూడదు అని కొంత చెయ్యను ఫోన్.


నన్ను భరించిన నా కుటుంబ సభ్యులు, బంధువులు, కొంతమంది మిత్రులు. వీళ్లంతా మహానుభావులు.


ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కోవడం నాకు తెలియదు. అనుభవం లేకపోవటమే కారణం అవుతుంది. ఇది అందరిలో ఉండే లోపమే. కానీ నా మట్టుకు నేను అలాంటి పరిస్థితుల్ని చాలా కష్టంగా దాటుతూ ఉంటాను. అలాంటి పరిస్తితులు నాకు ఎదురైన ప్రతిసారి నాకు తోడుగా ఎవరో ఒకరు స్నేహితుడుగా ఉండే వారు. వాళ్ళు కూడా మహానుభావులు.


ఇక నాలో ఇప్పటికీ కొనసాగుతున్న భయం గురించి చెప్పాలంటే నీతో కొంచెం మాట్లాడాలి అని ఎవరయినా నాతో అంటే నాకు భయం. మాట్లాడే వరకు టెన్షన్ ఏం మాట్లాడతారో అని. ఎవరైనా పాత స్నేహితుడు నాకు ఫోన్ చేస్తే నాకు భయం. దేనికి చేస్తున్నాడు అని. ఇలా అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే భయం ఏం జరగబోతుంది అని. ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడితే నాకు భయం ఏం సమాధానం చెప్పాలో అని.


పచ్చిగా చెప్పాలి అంటే వాళ్ళు పీకేది, నాకు ఊడేది ఏం ఉండదు. నేను ఏం జరిగినా తట్టుకోగలను, ఎదుర్కోగలను. అలవాటు అయ్యాయి ఎన్నో, అనుభవాలు ఉన్నాయి మరెన్నో. అయినా నాకు భయం. ఆ సమయంలో మాత్రం నా గుండెల్లో అదురు, నా మాటల్లో బెదురు బయట పడకనే పడతాయి. అందుకే నేను ఎక్కువగా సైలెంట్ గా ఉండటానికి ప్రయత్నిస్తా. దాని వెనక ఉన్నది నా ప్రశాంతత అని చెప్తే నేను అబద్దీకుడిని అవుతాను. నేను ఒక భయస్తుడిని.


నాకు గొడవలంటే భయం. వాటికి దూరంగానే ఉంటాను. ఎందుకంటే గొడవ పెట్టుకుని మళ్ళీ కలిసిపోయే మెంటాలిటీ నాకు లేదు. నేను ఒకరితో గొడవ పడితే మళ్ళీ చాలా రోజులు మాటలు ఉండవు. కానీ కొంతమంది పక్క పక్కనే ఉంటారు. రోజు సీరియస్ గా గొడవ పడతారు. మళ్ళీ కలిసిపోతారు. కానీ వాళ్ళు మళ్ళీ కలిసేది మళ్ళీ గొడవ పడటానికే అని తర్వాత తెలుస్తుంది. అలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చెయ్యను. గొడవ పెట్టుకున్నాక మళ్ళీ మాట్లాడాలంటే నాకు చాలా మోహమాటం. అందుకే నా వాళ్ళు ఎవరైనా గొడవకి వెళ్తే నేను వాళ్ళతో పాటు వెళ్లను. దూరం నుంచి చూస్తాను. దగ్గర ఉంటే ఇన్వోల్వ్ చేస్తారు అని భయం.


కొంతమంది కి దొరికిపోతాను భయపడి దాక్కున్నాను అని. దాన్ని నేను కవర్ చెసుకోను. నేను నిజంగా దాగుకునే పిరికివాడినే. 


నాకున్న రెండో చెడ్డ అలవాటు మొహమాటం గురించి అయితే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. ఎవరిని అయినా ఏమైనా అడగాలి అంటే మొహమాటం, ఇవ్వరేమో అని. ఎవరైనా ఏదైనా అడిగితే మోహమాటం ఇవ్వకపోతే ఏమనుకుంటారో అని. ఒకరి దగ్గర రెండోసారి సహాయం తీసుకోవాలి అంటే మొహమాటం. ఎవరికైనా అడగకుండా ఏదైనా ఇవ్వాలి అన్నా కూడా మోహమాటమే తిరస్కరిస్తారేమో అని. ఏదైనా పని చెప్పాలంటే మోహమాటం చెయ్యను అంటారేమో అని. బేసిక్ గా నేను నో చెప్పించుకోవటం అంతగా సహించలేను. ఇనీషియేటివ్ తీసుకొని కొత్త వాళ్లతో మాట్లాడలేను, సహాయం అడగలేను మొహమాటం వల్ల. అలాంటి పరిస్థితుల్లో కూడా నాతో పాటు ఉంటూ నాకు ప్రతిగా సహాయం అడిగి, చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మహాహానుభావులు. 


నిజానికి ఈ ముఖమాటం వల్ల నాకు ఎన్నో సార్లు క్షవరం, గుండు, గర్భ ప్రసూతి, కొన్నిసార్లు గర్భస్రావం కూడా అయ్యాయి. ఈ మోహమాటం వల్లే అబద్దాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకి బయట వ్యక్తి దగ్గర మోహమాట పడి ఏదైనా అనవసర వస్తువు ఎక్కువ ధరకి కొని ఇంటికి తెస్తే ఇంట్లో తిడతారని భయంతో అబద్ధం చెప్పాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో అలా చెయ్యటం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయ్యిన పని. మా నాన్న గారికి వేపకాయంత మొహమాటం ఉంది. నాకు పుచ్చకాయ అంత అబ్బింది.



నన్ను కని పెంచటంలో నా తల్లిదండ్రుల శ్రమని, ఓర్పుని మెచ్చకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా పైన పేర్కొన్న మహానుభావులు అందరికీ నా వందనాలు. 


నాకున్న మైనస్ లన్నీ ఇలా చెప్తుంటే మీరు రకరకాలుగా అనుకోవచ్చు. మాకెందుకొచ్చింది ఇవన్నీ అని, ఏదో గొప్పలుగా చెప్పుకుంటున్నాడని, అసలెందుకు చెప్తున్నాడని, సుత్తి, టైం వేస్ట్ అయ్యింది అని. దీని వల్ల కొందరైనా నా మానసిక స్థితిని అర్ధం చేసుకుని పదర్థాలు తీసి నన్ను అపార్ధం చేసుకోకుండా ఉంటే అనర్ధాలు జరగకుండా ఉంటాయని భయం, మొహమాటం ఇంకా సిగ్గు లేకుండా ఈ యదార్ధాలు రాసేసాను.


-ఎక్స్

Friday, February 12, 2021

Midnight Masala

B017 dated at Tadepalligudem the 12.02.T21


రాత్రి 1.40 అయింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు. తలనొప్పి వస్తుంది. భయాందోళనలు ఆలోచనలై మెదడుని తొలిచి వేస్తుంటే అవి ముళ్ళై కునుకు లేని కళ్ళలో మొలుచుకొస్తుంటే పగలు రాత్రి అని తేడా ఏం ఉంటుంది. 


ప్రతి మనిషికి తనకి ఉన్న ఒత్తిళ్లకి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ఉంటుంది. Stress buster అంటారే అది. ఉన్న బాధల్ని మర్చిపోవటానికి లేదా మార్చుకోవటానికి ఎదో ఒక Alternative way ఉంటుంది. నాకు ఇంత రాత్రిలో అలాంటివి ఏమి కుదరవు. అందరూ నిద్రపోయిన టైమ్. అందుకే ఇలా ఇక్కడ విరుచుకుపడాల్సి వస్తుంది. నా స్టేటస్ లు, పోస్ట్ లు చదివిన చాలామంది లో కొంతమంది అడిగిన common questions ఏంటి అంటే, అసలు నీకున్న బాధలు ఏంటి, ఉంటే మాత్రం ఇలా అందరికి చెప్పి ఏం బావుకుంటావ్ సింపతి కోసమా అని. నేను ఎవరిని పిలిచి నా కష్టాలు చెప్పుకోవట్లేదు. ఎందుకంటే అవి ఎవరూ తీర్చి, ఆర్చలేనివి. అలా అని దాచుకుని భరించేస్తూ ఉంటే నేను చాలా ఆనందంగా ఉన్నానేమో అనే భ్రమ అందరిలో కలిగే అవకాశం నేను వారికి ఊరికే ఎందుకివ్వాలి.


ఇలాగే ఒక స్నేహితుడు నన్ను అడిగాడు, అసలు ఇంత పిచ్చ హాపీగా నేను ఎలా ఉండగలను అని. నాకు పిచ్చ నవ్వు వచ్చింది అపుడు. నేను బాధ పడినట్టు గాని ఆనందంగా ఉన్నట్టు గాని ఎప్పుడూ బయటకి కావాలని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలి అనుకోలేదు. నాకు తెలిసి అలా చెయ్యలేదు కూడా. అయినా ఆనందాలు అనుభవించాలి, బాధలు భరించాలి, అవన్నీ అందరికీ పంచాలి. ఇదే కదా జీవితం. కొన్ని బాధలకు కొనసాగింపు తప్ప మినహాయింపు ఉండదు. అంటే వాటికి సొల్యూషన్ ఉండదు కానీ వాల్యుయేషన్ ఉంటుంది.


మనకి ఉన్న సమస్యను బట్టి బాధని అంచనా వెయ్యలేం. ఎందుకంటే ఎన్నో విషయాల్లో నా కంటే కలిగి ఉన్న వాళ్లలో కొంతమంది నా బాధలకి వాళ్ల బాధల్ని జత చేసుకుని చెప్తూ నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఒక్కటే. సంతృప్తి అనేది వాళ్ళు పొందలేకపోతున్నారు. నిజానికి మనం తీసుకునే కొన్ని బాధ్యతలే, మోసుకునే కొన్ని బరువులే బాధల్ని మిగులుస్తాయి. వాటికి కారణాలు మనం తప్పుగా తీసుకున్న నిర్ణయాలే. 


మొయ్యలేక వదిలేస్తే బలహీనుడు అంటారు, పోనీ పారిపోతే పిరికివాడు అంటారు. ఆలోచన అనేది ఏదైనా మొదలెట్టే ముందే ఉండాలి. మొదలెట్టాక ఆలోచించే అవసరం వచ్చింది అంటే మొదలెట్టడమే తప్పు అని అర్ధం. ఇతరుల మీద మోపలేని, సొంతంగా ఓపలేని, అలాగని ఆపలేని పనిని గురించి ఇలా వ్యాసాలు రాసుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఇంకా తలనొప్పి తగ్గలేదు. టైమ్ 2.26 అయింది, నిద్ర కూడా రావట్లేదు. అంటే నేను రాయాల్సింది ఇంకా ఏదో ఉంది కాని మానసిక సహకారం లేదు.



-ecKce

Tuesday, February 9, 2021

Being Better - 1

B016 dated at Tadepalligudem the 09.02.T21.


Having seen this kind of progress around me I am deeply disappointed with great count of discouragement and I sincerely dishonor the situations across. Everyone is matured enough to be kind and no one is behaving as they should. People with little liberty of disobedience are distracting themselves from legal routine. It became their own right to not being right. Quality questions from qualified questionnaires are left unanswered with rigid recklessness of the rude minded ruthless rascals with rooted rowdyism. Amateurs are trained by evil spirits that practice the devil activities with immature innocents. Common humanoid beings are sitting dumb and deaf as and when they can ony spectate the inconvenience and injustice that suffers only other communal cult.


Just for the sake of one's once self promised material assistant, one should not vote for the illegal accountancy. One's support should directly or indirectly not be like a blind folded thing which no matter does give well sounded chorus to the wrong tuned chords.


It's of bloody no use if any of the outcomes of inner mind results in dissatisfaction with respect to the self conscience. The bunch of moral rules for any manly designed creature is developed in each individual's social growth which enacts its productivity in self character building towards an acceptable species on the roads.


To give equal and positive respected response to our opponent is a common sensed culture in the desired era of the current designated dynasty. Looking at your enemies' property loss you should not find bliss. Seeing their massive wealth you must not be disclose your malice. Your ultimate goal is not to make them destroyed but you should overcome, overtake and over cross your enemies with your beautiful success and awesome happiness.


Cursing the neighborhood is a cheap activity that only an incapable can do. He/she who reads blessing is an honor and curses indeed is cursed by the justice in fact. One's loss should not be self denounced. If any real deprivation happened to you, you will be rewarded with double benefits for sure iff you could be humble towards the circumstances.


Last but not least, one who only cares for the morality will be treated morally by the moral as per the norms of the morale that one believes in.   



To be continued......



-eckce.

Wednesday, January 27, 2021

Childhood Friend

B015 dated at Tadepalligudem the 27.01.T21


కుర్రతనం లో ఉండే ధైర్యం కొంచెం వయసొచ్చాక ఉండదు. ఆలోచనలు ఎక్కువయ్యో భయం ఎక్కువయ్యో ఏం చెయ్యాలన్నా వెనకడుగేస్తాం. చాలా సందర్భాల్లో అలా ఆగి ఆలోచించటం మంచిదే అవుతుందిలే. అందులోనూ వయసొచ్చాక కూడా అదే ధైర్యంతో ఏది పడితే అది చేసేస్తే నలుగురూ ఐదారు రకాలుగా అనుకుంటారనే భయం కూడా ఉంటుంది మరి.


నా చిన్నప్పుడు మా నాన్నగారి వ్యాపార స్నేహితుడి కొడుకు మా ఊరిలో వేరే పని కోసం కొన్నాళ్ళు ఉండగా మేము అతనితో బాగా క్లోజ్ అయ్యాము. మేము అన్నయ్య అని పిలిచే వాళ్ళం. మా ఇంట్లోనే భోజనం చేసేవాడు. అబ్బాయిని కాబట్టి నేను ఇంకా బాగా అతనికి దగ్గర అయ్యాను. ఎలా అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు. నేనంతే నచ్చితే బాగా కనెక్ట్ అయిపోతా. అది వేసవి కాలం కావటంతో ఉదయం బడి అవ్వగానే బువ్వ తినేసి అతని దగ్గరకి వెళ్ళిపోయే వాడిని. సాయంత్రం వరకు అతనితో ఉండే వాడిని. అలా కొంత కాలం తర్వాత అతను వచ్చిన పని అయిపోవటంతో వాళ్ళ ఊరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి ఏడాది సంక్రాంతి కి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. మా నాన్న గారు నన్ను అక్కడ దిగబెట్టారు. నన్ను సైకిల్ మీద ఊర్లో కాసేపు తిప్పాడు. అక్కడే ఆదివారం రాత్రి జెమినీ టీవీ లో వన్స్ మోర్ ప్లీజ్ షో, అమృతం సీరియల్, సిటీ కేబుల్ లో నువ్వు-నేను సినిమా చూసి నిద్రపోయిన రోజు ఇంకా గుర్తు ఉంది. తర్వాతి రోజు అనుకుంటఎగ్జిబిషన్ కి కూడా పక్కనే ఉన్న పట్నం తీసుకెళ్లాడు. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు. నాకు అక్కలు అన్నమాట. అది 2002 సంవత్సరం. అప్పటికే మూడు కొత్త సినిమాలు వచ్చాయి. మా ఫ్రెండ్ వాళ్ళ పక్కింటి ఆంటీలు చిరంజీవి డాడీ సినిమాకు వెళ్తే నేను,అతను మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి వెళ్లాం. మా వాడు వెంకటేష్ కి వీరాభిమాని. టక్కరి దొంగ సినిమా కథ వాళ్ల కజిన్ మాకు చెప్తే విన్నాం. వాళ్ళు అక్కడ పెట్టిన భోజనం, అందులోనూ నేను మొహమాటంగా మొదటిసారి రుచి చూసిన చేదు పచ్చి పులుసు, వాళ్లు చేసే పిండి వంటలు, స్వీట్లు (అదే వాళ్ళ వ్యాపారం) ఇవన్నీ తీపి జ్ఞాపకాలు. అయితే ఒక విషాదం కూడా జరిగింది. ఒకరోజు ఉదయమే వాళ్ల నాన్నగారు నన్ను పక్కనే ఉన్న పట్నం వెళ్దాం అని ఆయన వాడే మోపెడ్ మీద తీసుకెళ్తూ ఉన్నారు. ఎదురుగా వస్తున్న ఒక బండి డాష్ ఇవ్వటంతో ఆయన కాలికి బలమైన దెబ్బ తగిలింది. అక్కడ కాసేపు గొడవల తర్వాత ప్రధమ వైద్యం కోసం క్లినిక్ కి వెళ్లిన మాకు ఆయనకి తెలిసిన అతను కనిపించాడు. బహుశా ఆయనే అతన్ని అక్కడికి పిలిపించారు అనుకుంటా. ఆయన అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఇతనితో నన్ను బయటకి పంపించారు. అప్పుడు తెలిసింది అసలు నన్ను ఎందుకు ఉదయమే బయటకి తీసుకెళ్లారా అని. నాకు కొత్త బట్టలు కొన్నారు. అప్పుడు నాకు అయ్యో నాకు బట్టలు కొనటానికి వచ్చి ఇలా దెబ్బ తగిలించుకున్నారా అనిపించింది. కానీ నాకు బాగా మొహమాటం కదా. అనుకున్నవి ఏవీ బయటకు చెప్పలేకపోయా.


అలా అక్కడే ఆ పండగ ప్రతిసారి లా కాకుండా కొంచెం వేరేలా గడిపాను. ఆ నాలుగు రోజులు అయ్యాక మా నాన్న గారు వచ్చి నన్ను మా ఇంటికి తీసుకొచ్చేశారు. నేను వేసుకున్న ఆ కొత్త బట్టల్ని చూసి మా అక్క ఆ అన్నయ్య బట్టలు నాకు ఇచ్చాడు అనుకుంది. అవే కొత్త బట్టలు నేను స్కూల్ కి వేసుకెళ్తే స్కూల్ యూనిఫామ్ వేస్కురాలేదని మా క్లాస్ లీడర్ గాడు నా చేత వంద గుంజీలు తీయించాడు, నేను కూడా గుల ఎక్కువై తీసేసాను. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి మా ఇంటి ముందున్న డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన అడిగారు, నిజం చెప్పు అసలు ఏమైంది అని. హ్మ్.



ఏదైనా కొత్త అనుభవం మనకి నచ్చితే మళ్ళీ అదే కావాలి అనిపిస్తుంది కదా. ఎంత తొందరగా మళ్ళీ అనుభావిస్తామా అని ఆత్రంగా ఉంటుంది. ఇది అందరకీ అన్ని విషయాల్లోనూ ఉంటుంది.  అదే నాకు అనిపించింది నా ఫ్రెండు ని చూడాలి అని. అప్పుడే నాకు కొత్త సైకిల్ కొన్నారేమో ఒక ఆదివారం మా నాన్న గారు ఇంట్లో లేనప్పుడు మా అమ్మ బిజీగా ఉన్నప్పుడు నేను రెడీ అయిపోయి నా హెర్క్యూలుస్ MTB సైకిల్ వేసుకుని బయలుదేరా. దానికి ముందు ఒక పని చేసాను. ఒక చిన్న కాగితంలో 'అమ్మా, నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను, కంగారు పడవద్దు' అని రాసి మా అమ్మకి కనిపించేలా ఫ్రిడ్జ్ మీద పెట్టాను. అనుకున్నట్టుగానే వెళ్లి వాళ్ళతో గడిపి సాయంత్రానికి వచ్చేసా. ఆ రోజు సాయంత్రం మా అమ్మ మా నాన్న గారితో చిన్నోడు భ్రమ తిరిగిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అని ఆశ్చర్యంగా చెప్పటం నేను విన్నాను. కానీ నాకు ఇప్పటికీ తెలియని విషయం మా అమ్మ నేను రాసింది అసలు చదివిందా లేదా? నేను అంత సినిమాటిక్ గా ఎలా అలా చెయ్యగలిగానో? అప్పటికి మా ఇంట్లో కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు అని గుర్తు.


తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు, వాళ్ళ గృహ ప్రవేశానికి కూడా వెళ్ళాను. 2003 లో మహా శివరాత్రి కి అక్కడికి మళ్ళీ వెళ్ళాను. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ రెండో సగం అక్కడే చూసా. పగలు అన్వర్ 101 చూడలేదు కానీ సచిన్ 98 చూసా. తర్వాతి రోజు పేపర్ లో పాక్ కు కాళరాత్రి భారత్ కు శివరాత్రి అని పేపర్ లో చూసా. 23 మార్చ్ న ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే చూడటానికి మా నాన్న గారితో కలిసి వెళ్ళాను కానీ వాళ్ళు ఇంటి దగ్గర లేకపోవడంతో మేము పట్నం వెళ్లి ఇంటికి వచ్చేసాము. ఆ రోజు మా ఊర్లో ఉన్న క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదటి సగం అయ్యాక సాయంత్రం మనోళ్లు కొడతారా లేదా అని భయపడుతూ రోడ్ మీద నడుస్తూ మాట్లాడుకోవడం నేను మర్చిపోను. నా ఫ్రెండ్ ని మళ్ళీ కలిసే అవకాశం 2004 డిసెంబరు లో వచ్చింది. 26వ తేదీన సముద్రం మా ఊరు మీదికి వచ్చేస్తుంది అని భయంతో పనికి వెళ్లిన వాళ్ళు బోరున ఏడుస్తూ తిరిగి రావటం బ్రష్ చేస్తున్న నేను చూసి ఇంట్రస్టింగ్ గా చూసాను.  ఊరు విడిచి వెళ్ళిపొమ్మని వచ్చిన హెచ్చరికలతో బెడ్ రెస్ట్ లో ఉన్న మా అక్క తో సహా మేము మా ఫ్రెండ్ ఇంటికే వెళ్ళాము. తర్వాతి రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాము. దాన్నే తర్వాత సునామి అన్నారు. ఆ పదం అప్పట్లో మీ అందరికి కొత్త కావచ్చు. కానీ అంతకు ముందు ఏడాదే సోషల్ బుక్ లో నేను సునామి తరంగాల గురించి చదివాను. నేను పదో తరగతి వీడ్కోలు పుస్తకాల్లో (ఫ్రెండ్ స్లామ్ బుక్స్) నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అతని పేరే రాసాను. తర్వాత నేను కాలేజ్ కి వెళ్ళేటప్పుడు దారిలో మా ఫ్రెండ్ ఇంటి పక్క నుంచే రోజుకి 32 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన రోజులు కొన్ని ఉన్నాయి.



ఇవి నా ఫ్రెండ్ సంగతులు. అతను కూడా నా లాగే మోహమాటస్తుడు. కొంచెం మిత భాషి. కొన్ని ప్రత్యేక లక్షణాలు అయితే అతనిలో ఉన్నాయి. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ నాకు టచ్ లో ఉన్నాడు. కానీ అప్పట్లా అయితే అసలు కాదు. దానికి కారణం పెరుగుతున్న వయసు, చుట్టూ ఉన్న పరిస్థితులు. కానీ ప్రతి జనవరి 7న నేను విష్ చేస్తాను. ఎప్పుడైనా అతను కాల్ చేస్తాడు. అందుకే చెప్పా కుర్రతనపు అనుభూతులే వేరు.



-ecKce

Wednesday, January 20, 2021

Sharing Sufferings

B014 dated at Tadepalligudem the 20.01.T21


ఒక స్నేహితుడు నా దగ్గర తన గోడు విన్నవించుకున్నాక దాన్ని నా తరపున వర్ణించాలని ఇలా రాస్తున్నా.


కొన్ని దెబ్బలు తగిలినప్పడు వెంటనే నొప్పి తెలుస్తుంది. గాయం ఉన్నంతసేపు నొప్పి ఉంటుంది. నొప్పి పోయిన తర్వాత గాయం తగ్గిపోతుంది. ఇక్కడ గాయం నొప్పి ఒకేసారి వచ్చి కాస్త అటు ఇటుగా ఒకేసారి కలిసి కట్టుగా పోతాయి. కానీ కొన్ని దెబ్బలు తగిలినప్పుడు తెలియదు, తగ్గేదెప్పుడు తెలియదు. దెబ్బ పడినప్పుడు నొప్పెయటం కాదు తియ్యగా అనిపిస్తుంది. ఎలా అంటే ఏదో నీతి కథలో రక్తం రుచి మరిగిన జంతువు వేటగాడు పూసిన రక్తపు కత్తిని నాలుకతో చప్పరిస్తూ తన రక్తాన్నే ఆరగిస్తూ చచ్చిపోయినట్టు. దురద పుడుతుంది. కానీ గోక్కుంటేనే బాగుంటుంది. పుండు పెద్దది అవుతుంది అని తెలిసినా గోళ్ళకు అదేం పట్టదు. 


ఇదొక ఉచ్చు అని అందులో చిక్కుకున్నప్పుడు తెలియదు. ఒక్కసారి బయటకి వచ్చాకే ఆ ఉచ్చు కంటికి కనిపిస్తుంది. అందుకే అంటారు బయటకి వచ్చి చూడాలి అని. అలాంటి ఎదో ఒక ఉచ్చులో అందరూ ఎప్పుడో ఒకప్పుడు చిక్కి ఉంటారు. అలాంటి ఒక అనుభవమే ఇది. నూరు గొడ్లు తిన్న రాబందు అధోగతి తెలుసు కదా. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కొంత వింత అనుభూతి చాలు కదా కథ కంచికి చేరటానికి. తప్పులు అందరూ చేస్తారు. కొన్ని తప్పులు చెయ్యటానికి పెద్దగా ఆలోచించరు. కొన్ని తప్పులు చేసాక అంతగా పట్టించుకోరు. కానీ కొన్ని తప్పులు చెయ్యటానికే కాదు వాటి గురించి ఆలోచించటానికి కూడా భయపడతారు. కానీ తప్పినా తప్పుకున్నా తప్పు చేసాక మాత్రం ఎప్పుడూ భయపడుతూనే ఉండాల్సొస్తుంది. చేసింది ఒకటే తప్పు కావచ్చు. పోనీ అది తెలియక చేసిన పొరపాటే అవ్వొచ్చు. నిజానికి ఆలోచన లో తప్పు ఉంటే మొదట ఆచరించేది మాత్రం నోరు. అవును, తప్పు జారే ముందు నోరు జారుతుంది. ఉరికే అన్నారా మరి,  నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అని?


జీవితంలో అతి తక్కువ సార్లు చవి చూసిన చేదు అనుభవాల్లో ఇది ఒకటి. ఇందులోంచి ఎప్పుడు ఏ స్థితిలో బయట పడతానా అని భయాందోళనలతో ఎదురు చూస్తున్నా. జీవితంలో మళ్లీ అనవసరమైన ఇతరుల సమస్యల్లో తల కాదు కదా కనీసం వెంట్రుక కూడా దూర్చకూడదు అని నిశ్చయించుకున్నాను. నిజానికి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. 

ఇక్కడే నాకొక డౌట్ వస్తుంది. నేను చేసిన ఒక్క తప్పుకే దాని భవిష్యత్ పరిణామాలు ఏంటా అని ఆలోచిస్తుంటే నాకు వెన్ను వణుకుతుంది. మరి ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన పరమ కిరాతకులనబడే నేరస్తుల ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలి అనిపిస్తుంది అని కన్నీరుమున్నీరై వాపోయాడు వాడు. 


త్వరలోనే తనని పట్టి పీడిస్తున్న ఈ మానసిక రుగ్మతకి కారణమైన ఆ సమస్య(ల) నుంచి బయట పడాలని నాతో పాటు మీరందరూ కోరుకోవాలని కోరిక కోరుతూ


-ఎక్స్

Monday, January 18, 2021

Temporal Proximity

B013 dated at Tadepalligudem the 18.01.T21


అంతకు ముందు ఆ తర్వాత. ఈ ముక్క విన్నారు కదా. Before and after any strong incident పరిస్థితులు, పరిణామాలు చాలా వేరుగా ఉన్నప్పుడే ఇలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం. జ్ఞానోదయం జరిగినట్టు కొన్ని చాలా మారిపోతాయి. ఆ మార్పుకి కారణం ఏదైతే ఉందో అదే ఇక్కడ ముఖ్యం.


ఏదైనా ఒక విషయం మనకి రిజిస్టర్ అయ్యాక ఒకలాగా రిజిస్టర్ కాకముందు ఇంకోలాగా ఉంటుంది. ఆ విషయం ఏమైనా అవ్వొచ్చు. ఉదహరణకు ఒక పదం(particular word) గురించి అనుకుందాం. ఎవరైనా మనకి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటాం కాబట్టి ఆ వ్యక్తి మాటల్లో ఏదైనా ఆకర్షించే పదంలా అనిపిస్టే దాన్ని మన మైండ్ ఎలా రిజిస్టర్ చేస్కుంటాది అంటే కొన్ని రోజుల పాటు మనం ఆ word ని మన మాటల్లో బయట పెట్టేలా చూసుకుంటాం. అంటే ఆ పదాన్ని మనం ప్రమోట్ చేస్తున్న ముసుగులో వాడేసుకుంటాం. ఆ పదం మనం అంతకు ముందు చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఆ విషయం కూడా మనకి గుర్తు ఉండదు. ఎందుకంటే అపుడు మనం సరిగా వినలేదు లేదా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ కొన్నాళ్ల తర్వాత మనకి ఎవరి ద్వారానో గుర్తు వచ్చినప్పుడు ఇదంతా ఆలోచిస్తాం. నేను అంతటితో ఆగకుండా ఇలా బ్లాగ్ లో రాస్తా.


పై విషయం ఇంకా క్లియర్ గా అర్ధం అవ్వాలా? అయితే ఒక్కసారి infatuation అనే word గురించి కాసేపు ఆలోచించండి. ఆ word మీకు ఎలా తెలిసింది? అంతకు ముందు ఆ word మీరు వినలేదా? విన్నారు కానీ ఇంత మోతాదులో కాదు అందుకే మన మైండ్ లో రిజిస్టర్ కాలేకపోయింది. ఇక్కడ కారణం కారకం ఏమిటో తెలిసింది కదా.


ఒకోసారి మనకి కొన్ని విషయాలు బాగా నచ్చుతాయి. అలా నచ్చటానికి ముఖ్య కారణం ఎదో ఉంటుంది కదా. ఆ విషయం కంటే ఆ కారణమే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే ఆ కారణం వల్లే ఆ విషయం నచ్చింది కదా. ఆ కారణం వెనక ఒక వ్యక్తి ఉండే తీరాలి. వ్యక్తి లేకపోతే ఏదో శక్తి అయినా ఉండాలి.


ఇపుడు చెప్పొచ్చేదేంటంటే ఆ విషయం ముందు మనకి తెలిసినా నచ్చేది కాదు. కానీ ఈ వ్యక్తి/శక్తి అనే కారణం వల్ల ఇప్పుడు నచ్చుతుంది.


ఇలా అకస్మాత్తుగా మనసు మార్చుకోవడానికి ఇష్టం పెంచుకోవడానికి ప్రభావితం చేసిన ఆ కారణం, దాని కారకం అన్నిసార్లు మంచికే అని చెప్పలేం. భవిష్యత్ ఫలితాలు తేలుస్తాయి మంచి చెడుల్ని. ఆ కారకం వల్ల మనం మనస్సు మార్చుకోవాల్సిన అవసరం అక్కడ ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. అది కాస్త అనుభవం మీదే వస్తుంది.


ఆలోచన లేని నిర్ణయం, అతి నమ్మకం అంధ విశ్వాసం అయ్యే ప్రమాదం ఉంది.


ఈ బ్లాగ్ రెండు రోజులు రాసిన ముక్కలతో చేసిన ఒక అతుకుల అట్ట. ఇక ఇంతే.



౼eckce

Saturday, January 16, 2021

Prefamous

 B012 dated at Tadepalligudem the 16.01.T21


అందరి దృష్టిలో పడటం ఎంత కష్టమో కదా. ఎందుకంటే అందరూ చాలా పనుల్లో ఉంటారు. అలాంటి అందరూ ఒకానొక టైమ్ లో ఒకరినే చూడాలి అంటే ఆ ఒక్కరు ఏం చేసి ఉండాలి? ఫేమస్ అవటం ఈ రోజుల్లో కాస్త ఈజీ అయింది గాని అప్పట్లో చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండేవారు. ఏదో అద్భుతం లాంటిది జరిగితే గాని వారి దృష్టి మరలేది కాదు. ఇప్పుడు అయితే ఎవరు ఫేమస్ అవుతారా చూద్దాం అని వారి బిజీ లైఫుల్లో కూడా కాస్త సమయం కేటాయించే ప్రత్యేక వర్గం, ఆ వర్గాన్ని అనుసరించే అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నాయి.


ఈజీ గా ఫేమస్ అయ్యే వాళ్ల గురించి పక్కన పెట్టేద్దాం. కష్టపడి పైకి వచ్చారు అనే కోణంలో అందరి దృష్టిలో పడ్డ వారు ఆ స్థాయికి రావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. వారి స్థానభ్రంశమే వారి కష్టానికి సాక్ష్యం. క్రికెట్ లో లోయర్ ఆర్డర్ లో ఆడే ఆటగాడు కొన్ని సంవత్సరాలకు ఆ టీం కి ఓపెనర్ గా స్థిరపడటమే సక్సెస్ అంటే. ఇది కేవలం ఉదాహరణ కోసమే. సినిమా వాళ్లలో కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీకు అర్ధం అవటం కోసం మాత్రమే చెప్తున్నా సుమా.


చెట్టు కాయలు కాసిన తర్వాత అందరూ కోసుకు తింటారు. కానీ మొక్క స్థాయి నుంచి దాని పెరుగుదలని చూసే వాడి దృష్టి వేరుగా ఉంటుంది. ఈ మొక్క పెద్ద చెట్టుగా మారి కాయలు కాస్తుంది అని ముందే చెప్పగలిగే వాళ్ళు అలా చెప్పినప్పుడు అందరూ నవ్వుతుంటే బాధ పడతారు కానీ వారి భవిష్యవాణి నిజం అయినప్పుడు గర్వపడతారు.


మనలో ఒకడు బాగా పైకొస్తాడు అని ఒకోసారి మనకు ముందే తెలుస్తుంది. కానీ అలా చెప్తే ఎవరు నమ్మరు కానీ ఆక్షేపిస్తారు. ఇది అమ్మాయిల విషయంలో కూడా జరుగుతుంది. అలా ఎలా అనిపిస్తుంది నీకు అని కొందరు అంటారు, ఎలా నచ్చింది నీకు అని ఇంకొందరు నవ్వుతారు. కానీ తర్వాత నవ్విన వాళ్లే మన కంటే ముందు వరసలో కూర్చుని సొల్లు కారుస్తూ చప్పట్లు కొడతారు (అంటే వారి విజయాన్ని ఆస్వాదిస్తారు అని చెప్తున్నా). అపుడు మన పరిస్థితి: నేను ముందే చెప్పా కదా అని నవ్వాలో, నేను చెప్పినప్పుడు ఎవడు వినలేదు అని ఏడవాలో తెలియదు.


ఈ రోజుల్లో పిల్లలు వారికి తెలిసిన ప్రస్తుతం గురించి వారిని ఊరికే వరించిన స్వేచ్ఛను బట్టి వారికి అందుబాటులో ఉన్న సాంకేతికను ఉపయోగించి ప్రలాభాలు పోతుండటం చూసి ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఆ వయసులో మనకి అన్ని సదుపాయాలు అవకాశాలు లేవు. కానీ మన అనుభవంతో పోలిస్తే వాళ్ళు అన్ని విషయాల్లో ముమ్మాటికీ పిల్లలే.


నా కంటే గొప్పదైన నా ముందు తరం యువతకి ఇది అంకితం. 


-eckce

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...